UP: ఘజియాబాద్‌లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
- ఘజియాబాద్‌లో దారుణం
- రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
- నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకూ కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయి. రక్తసంబంధుల మధ్యే మానవత్వం మంటగలుస్తోంది. ఆస్తుల కోసం రక్తసంబంధుకులే ప్రాణాలు తీయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. రూ.150 కోట్ల విలువైన కుటుంబ ఆస్తి కోసం సొంత కొడుకే కన్నతండ్రిని కాల్చి చంపాడు. హత్య అనంతరం నిందితుడు పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
బుధవారం రాత్రి మోడీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధానా గ్రామంలోహరి ఓం చౌదరి (52) స్థానికంగా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త. ఆయనకు ఢిల్లీ-మీరట్ రోడ్డుపై కమర్షియల్ మార్కెట్‌తో పాటు సుమారు 75 బీఘాల భూమి, మొత్తం కలిపి దాదాపు రూ.150 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. హరి ఓం తన భార్య అనిత, ఇద్దరు కుమారులు నిఖిల్, నిషుతో కలిసి నివసిస్తున్నాడు. పెద్ద కుమారుడు నిఖిల్‌కు మద్యం సేవించే అలవాటు ఉంది. దీంతో ఆస్తి పంచాలంటూ నిత్యం వేధిస్తు్న్నాడు. ఆస్తిని తన పేరుకు బదిలీ చేయాలంటూ తరచూ తండ్రితో గొడవపడేవాడు. బుధవారం రాత్రి నిఖిల్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. దీనిపై తండ్రి అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆస్తి విషయంలో వివాదం మరింత ముదరడంతో నిఖిల్ తన దగ్గర ఉన్న అక్రమ పిస్టల్‌తో హరి ఓంపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
- Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
- EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
ఈ ఘటనలో హరి ఓంకు మొత్తం నాలుగు బుల్లెట్ గాయాలు అయ్యాయి. వాటిలో రెండు ముఖానికి, ఒకటి ఛాతీకి, మరొకటి నడుము కింద భాగంలో తగిలాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో హరి ఓం గతంలో కుటుంబ వివాదాన్ని పరిష్కరించేందుకు నిఖిల్‌కు సుమారు 25 బీఘాల భూమి, కొన్ని దుకాణాలు బదిలీ చేసినట్లు వెల్లడైంది. అయినప్పటికీ కుటుంబ ఆస్తిలో ఇంకా పెద్ద వాటా కావాలంటూ నిఖిల్ ఒత్తిడి కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు.
2018లో తమ్ముడిపైనా కాల్పులు
నిఖిల్ గతంలో కూడా హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. 2018లో తన తమ్ముడు నిషుపై కూడా కాల్పులు జరిపి హత్యాయత్నం చేసినట్లు సమాచారం. అయితే ఆ ఘటనలో నిషు ప్రాణాలతో బయటపడ్డాడు. మోడీనగర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ భాస్కర్ వర్మ మాట్లాడుతూ.. నిందితుడు నిఖిల్ పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిఖిల్ బీబీఏ గ్రాడ్యుయేట్ అని, కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
- Tags
- Ghaziabad
- son
- Uttar Pradesh
తాజావార్తలు
-
UP: ఘజియాబాద్‌లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
-
Kiran Abbavaram: ‘మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..’ ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
-
Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
-
Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
-
Vallabhaneni Anil: జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వివాదం కాదు.. తప్పు చేస్తే ఫెడరేషన్ శిక్షిస్తుంది!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!