Gayathri Gupta-Baby: బేబీ సినిమాలో నేనే హీరోయిన్.. గాయత్రి గుప్తా సంచలన కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gayathri Gupta Controversial Comments on Baby Movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బేబీ’ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో వైష్ణవి చైతన్యకు స్టార్ డమ్ వచ్చింది. బేబీ అనంతరం వైష్ణవి కెరీర్ పూర్తిగా మారిపోయింది. వరుస అవకాశాలు ఆమెను వరిస్తున్నాయి. అయితే బేబీ సినిమాలో తాను హీరోయిన్‌గా నటించాల్సిందని గాయత్రి గుప్తా తెలిపారు.
గాయత్రి గుప్తా వ్యాఖ్యలతో బేబీ వివాదం మరింత ముదురుతున్నట్లు కనుబడుతోంది. బేబి సినిమా కథ తనదేనని, సాయి రాజేష్ తన దగ్గరి నుంచి కాపీ కొట్టాడని ‘ప్రేమించొద్దు’ డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ ఇప్పటికే మీడియా ముందుకు వచ్చారు. సాయి రాజేష్ మోసాన్ని ‘బేబీ లీక్స్’ అనే బుక్ ద్వారా ఆయన బయటపెట్టారు. బుక్‌కు సంబంధించిన లింక్‌ను https://babyleaks2023.blogspot.com/ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లలో షేర్ చేశారు. ఈ రచ్చ కొనసాగుతుండగానే.. గాయత్రి గుప్తా మరో బాంబ్ పేల్చారు. బేబీ సినిమాలో ముందుగా తననే హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారని, డైరెక్టర్ సాయి రాజేష్ తనను మోసం చేశాడని ఆధారాలతో సహా గాయత్రి బయటపెట్టారు.
Also Read
- Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
‘నేను, శిరిన్ శ్రీరామ్ మంచి స్నేహితులం. 15 ఏళ్లుగా అతడు నాకు తెలుసు. నాకు విడాకులు అయ్యాక నాతో ఓ షార్ట్ ఫిల్మ్ చేశాడు. నా కెరీర్‌కు అది చాలా హెల్ప్ అయింది. బేబీ సినిమా స్టోరీని ‘ప్రేమించొద్దు’ అనే టైటిల్‌తో శిరిన్ రాసుకున్నాడు. ఈ చిత్రంలో మొదటగా హీరోయిన్‌గా శిరిన్ నన్ను అనుకున్నాడు. స్కూల్ డ్రెస్సులో నన్ను ఆడిషన్ కూడా చేశాడు. ఆ ఫొటోలను సాయి రాజేష్‌కు నేను చూపించాను. దానినే అతడు బేబీలో కాపీ కొట్టాడు. హృదయ కాలేయం ఆడియో లాంచ్‌కు నేను వెళితే.. సాయి రాజేష్ నన్ను చూశాడు. శిరిన్ దగ్గర నంబర్ తీసుకుని నాకు కాల్ చేశాడు. కొబ్బరిమట్ట సినిమా చేస్తున్నా.. అందులో నువ్వే హీరోయిన్ అని చెప్పాడు. అలా సాయి రాజేష్ నాకు పరిచయం’ అని గాయత్రి గుప్తా చెప్పారు.
Also Read: Virat Kohli: నిజం చెబుతున్నా.. ఆ రోజు చాలా భయపడ్డా: కోహ్లీ
‘సినిమా ఇండస్ట్రీలో నేను 20-30 సినిమాలు చేశా. కానీ కొబ్బరిమట్ట సినిమాతో చాలా కష్టాలను ఎదుర్కొన్నా. 4-5 ఏళ్లు షూటింగ్ జరిగింది. ఈ సినిమాకు సాయి రాజేష్ రూ. 3 లక్షల పారితోషికం ఇస్తానన్నాడు. కానీ కేవలం రూ. 25 వేలు ఇచ్చాడు. ఈ స్టోరీ మీద రవి కిరణ్ అని కూడా పని చేశాడు. కొత్త అమ్మాయిని పెట్టుకుంటా అని శిరిన్ అనడంతో నేను ఓకే అన్నా. బేబి కథను మొదట రాసుకుంది శిరిన్. సాయి రాజేష్ ఆ స్టోరీని తానే క్రియేట్ చేశానంటాడు. ఇద్దరు (సాయి రాజేష్, శిరిన్) కలిసి ఆ కథతో మూవీ చేద్దామని.. చివరి క్షణంలో బడ్జెట్ లేదని శిరిన్‌ను తప్పించాడు. 2015 నుంచి ఆ కథను శిరిన్ రాసుకున్నాడు. ఆ కథను గీతా ఆర్ట్స్‌తో చర్చలు జరిపాడు. పాము లాంటి సాయి రాజేష్‌ను వారు గుర్తించలేదు. బేబీ మూవీ కోసం సాయి రాజేష్ చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేశాడు. సాయి రాజేష్ లాంటి వ్యక్తి టాలీవుడ్‌కు ఓ మచ్చ. బేబి స్టోరీ రాసుకున్న శిరిన్‌కు న్యాయం జరగాలి’ అని గాయత్రి గుప్తా ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?