ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ 2024 సీజన్ లో భాగంగా ఐపీఎల్ మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆదివారం నాడు రాత్రి జరిగిన మ్యాచ్లో కలకత్తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఆధ్యాంతం చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ మ్యాచ్ ఫోర్త్ ఎంపైర్ తో వాదనకి దిగాడు.
Also Read: YCP: వైసీపీ మేనిఫెస్టోకు తుది మెరుగులు..
నువ్వా.. నేనా.. అన్నట్లుగా జరిగిన మ్యాచులో చివరకు కలకత్తా నైట్ రైడర్స్ కేవలం ఒక్క పరుగుతో విజయం సాధించింది. ఇక మ్యాచ్ జరుగుతున్న సమయంలో 19 ఓవర్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 19 ఓవర్ లో ఆసక్తికర సంఘటన జరగడంతో ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 12 బంతులతో 31 పరుగులు అవసరమైన సమయంలో కలకత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డగౌట్ వైపు చూస్తున్నట్లుగా కెమెరాలకు కనిపించింది. అయితే డగౌట్ లో ఉన్న టీమ్ కు అతను ఏదో చెప్పాలని భావిస్తున్నాడని అనిపించింది.
Also Read: Satyabhama: కాజల్ అగర్వాల్ కి కొత్త బిరుదు.. ఆరోజే రిలీజ్!!
అయితే ఆ సమయంలో గౌతమ్ గంభీర్తో పాటు కలకత్తా నైట్ రైడర్స్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ మ్యాచ్ ఫోర్త్ అంపైర్ తో వాగ్వాదానికి దిగారు. అయితే అసలు ఎందుకన్న విషయం మొదట స్పష్టత రాలేదు. కానీ., మ్యాచ్ పూర్తయిన తర్వాత అసలు విషయాలు బయటకు వచ్చాయి. కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ మ్యాచ్ లో గాయపడడంతో అతడు ఫిల్లింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో సబ్స్టిట్యూట్ ఫిల్టర్ గా గురుభాష్ ను ఫీల్డ్ లో దించాలని కేకేఆర్ అభిప్రాయపడింది. అయితే ఈ అబ్యర్ధనను అంపైర్లు తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే గంభీర్ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు యాష్ దయాల్ బౌలింగ్ లో సునీల్ నరైన్ గాయపడ్డాడు.
— Nihari Korma (@NihariVsKorma) April 22, 2024