మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని అద్రాస్ పల్లి గ్రామంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇంటిలోని సామాన్లన్నీ పూర్తిగా దగ్ధమైనవి.ఈ ప్రమాదంలో ఇంటి యజమాని భాస్కర్ మరియు కుమారునికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో వారందరూ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే ఇంట్లో నుంచి పరుగులు పెట్టడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also Read : Uganda: స్కూల్‌పై టెర్రరిస్టుల దాడి.. 37 మంది విద్యార్థుల ఊచకోత..
గ్రామస్తులు వాటర్ ట్యాంక్ తో ప్రమాదానికి దగ్ధమైన ఇంటిని వాటర్ ట్యాంక్ సహాయంతో మంటలు అదుపులో తెచ్చారు. సిలిండర్ మారుస్తుండగా రెగ్యులేటర్ సరిగ్గా బిగించకపోవడంతో ఒకసారిగా మంటలు చెలరేగి సిలిండర్ బ్లాస్ట్ అయింది అన్నట్లు స్థానికులు తెలిపారు. ఇంతటి ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి అధికారులు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతానికి గ్రామస్తులు మంటలు ఆర్పివేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు వాటర్ ట్యాంక్ సహాయంతో ప్రమాదానికి గురైన ఇంట్లోని మంటలను అదుపులోకి తెచ్చారు.
Also Read : Viral News: ఆస్పత్రిలో వీల్ చైర్ లేకపోవడంతో.. స్కూటీపై మూడో అంతస్తుకు..!