రేషన్ డీలర్లు తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. డీలర్ల సంఘం నేతలు, అధికారులతో సమావేశమైన మంత్రి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17,220 రేషన్ షాపులు ఉండగా.. రూ.12 కోట్లకు పైగా కమిషన్ను డీలర్లకు చెల్లిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కాగా ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు రేషన్ డీలర్లు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అన్నార్థులు ఉండొద్దని, ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే గొప్ప సంకల్పంతో ప్రభుత్వం పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేపడుతుందన్నారు మంత్రి గంగుల. అంతేకాకుండా.. సంవత్సరానికి వేలకోట్లను వెచ్చిస్తూ నాణ్యమైన పోషకాల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ దారులకు ఇబ్బందులు రానివ్వద్దని గంగుల కమలాకర్ సూచించారు.
Also Read : Bandi Sanjay : కేంద్రం డబ్బులు వాడుకొని తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు
ఇదిలా ఉంటే.. కనీస గౌరవ వేతనంతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాల ఐక్య వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.లేకుంటే జూన్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవదిక సమ్మెకు దిగుతామని ప్రకటించింది. ఇటీవల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన రేషన్ డీలర్లకు కనీస గౌరవ వేతనం హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు. డీలర్లు చనిపోతే వారి కుటుంబంలోని వ్యక్తికే సదరు రేషన్ షాపును కేటాయించడంతో పాటు రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నారు. త్వరలో తెలంగాణ ఉద్యమం మాదిరిగానే వంట వార్పు, చలో హైదరాబాద్ పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు.
Also Read : Maoist Sympathizers: మావోయిస్టులకు సహకరిస్తున్న నలుగురు బీడీ కాంట్రాక్టర్లు అరెస్ట్