రాజమండ్రి వద్ద గోదావరిలో గణేష్ నిమజ్జనాలు కన్నుల పండుగగా సాగుతుంది. గోదావరి బండ్ ఇసుక రేవు వద్ద క్రేన్లు, ప్రత్యేక పంట్లు ఏర్పాటు చేసి రాజమండ్రి నలుమూలల నుండి వస్తున్న వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది పంటుపై గణేష్ విగ్రహాలను గోదావరి మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్న దృశ్యాలను వందలాదిగా తరలి వస్తున్న భక్తులు గట్టుకు నుండి తిలకిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గోదావరిలో గణేష్ నిమజ్జనాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
హైదరాబాద్ నగర పరిధిలో ఆరు గంటల పాటు ఊరేగింపుగా సాగిన 63 అడుగుల ఖైరతాబాద్ గణేశుడిని ఎట్టకేలకు గురువారం మధ్యాహ్నం హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు.బడా గణేష్ చివరి దర్శనాన్ని చూసేందుకు హుస్సేన్ సాగర్ వద్దకు భారీగా తరలివచ్చారు.వినాయక చతుర్థి తొమ్మిదో రోజు అర్ధరాత్రి ఖైరతాబాద్ గణేష్ పూజ ప్రారంభమైంది. ఆ తర్వాత, గణేష్ ఉత్సవ కమిటీ మొదట చిన్న విగ్రహాలను ఒక ప్లాట్‌ఫారమ్ మరియు వాటిని తరలించడానికి ఉపయోగించే ట్రైలర్‌పైకి ఎక్కించి ఊరేగింపును ప్రారంభించారు.