హిందూ దేవతల్లో ప్రథమ పూజలందుకునే గణనాథుడి దేవాలయాలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్నాయి. అయితే.. దట్టమైన అడవిలో కొండపైన ఉన్న ఓ చిన్న వినాయకుడి గుడికి సంబంధించిన వీడియో తాజాగా పాపులర్ అయింది. ఈ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని ధోల్కల్ కొండపై ఉంది. మురసు ఆకారంలో ఉన్నందున ఈ ఆలయాన్ని ధోల్కల్ గణేష్ దేవాలయం అని పిలుస్తారు. ఈ ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల నాటిదని చెబుతారు. ఈ ఆలయం (ధోల్కల్ గణేష్ దేవాలయం) సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తులో బైలడిలా శ్రేణిలో ఉంది. ఇనుప ఖనిజం అధికంగా ఉన్న అడవులలో ఈ పర్వత శ్రేణి ప్రముఖమైనది.
Also Read : Chetan Sharma: ‘కెప్టెన్సీపై కోహ్లీ అబద్ధం చెప్పాడు..గంగూలీపై అనవసర నిందలు’
ఈ పర్వతం ఎత్తు చూసిన వారికి కళ్లు తిరుగుతాయి. అయితే ఇప్పుడు ఈ పర్వతంపై పూజారి పూజ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. పూజారి వినాయకుడికి పూజ చేస్తున్నట్లు వీడియోలో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ఇప్పటి వరకు 2.2 మిలియన్లకు పైగా వీక్షణలు మరియు 460k లైక్‌లను సంపాదించింది. ఆ వీడియో కింద ‘అర్చకుడికి ధైర్యం మెచ్చుకోవాల్సిందే.. ఆయన స్థానంలో నేను ఉంటే అక్కడ నిలబడేందుకు కూడా నా కాళ్లు వణికిపోయేవి..(దేవుడు అతన్ని బాగా చూసుకుంటాడని అనుకుంటున్నాను)’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఆలయం 9వ లేదా 10వ శతాబ్దంలో నాగవంశీ రాజవంశం కాలంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. ఇక్కడ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అటవీ మార్గం గుండా దాదాపు 40 నిమిషాల పాటు కాలినడకన ఆలయానికి చేరుకోవచ్చు.
Also Read : New CEO of Twitter: ట్విట్టర్‌కు కొత్త సీఈవోగా పెంపుడు కుక్క..! ఎలాన్ మస్క్‌పై నెటిజన్ల ఫైర్