బీజేపీపై కాంగ్రెస్ మండిపడింది. పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్న మహనీయుల విగ్రహాలను వేరే చోటుకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. మహాత్మాగాంధీ, అంబేడ్కర్ వంటి విగ్రహాలు తొలగించడంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే లోక్సభ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో అక్కడ చేపట్టిన సుందరీకరణ పనుల్లో భాగంగా వాటిని పాత పార్లమెంట్ సమీపంలోని పార్కుకు తరలించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Giraffe Attack: రెండేళ్ల చిన్నారిపై జిరాఫీ ఎటాక్.. వైరల్ వీడియో..
ఛత్రపతి శివాజీ మహారాజ్, మహాత్మాగాంధీ, డా.బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసిన ప్రదేశం నుంచి తొలగించారు. ఇది చాలా దారుణం అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా స్పందిస్తూ.. ఒకవేళ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా సాధిస్తే.. కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేవారని ఆరోపించారు. పార్లమెంట్ ఆవరణలో సుందరీకరణ పనుల్లో భాగంగా మహాత్మాగాంధీ, అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ సహా ఇతర పోరాటయోధుల కాంస్య విగ్రహాలను తొలగించారు. వీటిని పాత పార్లమెంట్ భవనంలోని గేట్ నంబర్ 5 సమీపంలో ఉన్న పార్క్లో ఉంచినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: BJP: ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ చీఫ్ రాజీనామా..?