రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో నివాళులు అర్పించారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో.. ఖర్గే మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు.
బీజేపీపై కాంగ్రెస్ మండిపడింది. పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్న మహనీయుల విగ్రహాలను వేరే చోటుకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. మహాత్మాగాంధీ, అంబేడ్కర్ వంటి విగ్రహాలు తొలగించడంపై తీవ్ర స్థాయిలో మండిపడింది.