Game Changer : పోస్టర్‌తో కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసిన రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’
- కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన గేమ్ ఛేంజర్
- సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్
- సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా అప్డేట్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక టీజర్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల వరుస పరాజయాలతో సతమతమవుతున్న డెరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ తనకి మంచి కం బ్యాక్ లా నిలుస్తుంది అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ వస్తుండగా ఈ సినిమాపై మరో అప్ డేట్ చెర్రీ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తుంది.
Read Also:Ram Gopal Varma: ఆర్జీవీ పిటిషన్లపై విచారణ వాయిదా.. అన్ని కలిపి ఒకేసారి..!
Also Read
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అవగా, వాటికి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా నుండి మూడో సింగిల్ గా మెలోడీ పాటను తీసుకు రానున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపాడు. ఈ పాట ప్రేక్షకులందరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడంతో పాట.. వారికి సరికొత్త అనూభూతిని కూడా ఇస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ పాటకు సంబంధించిన అధికారిక ప్రకటన నవంబర్ 22న.. ప్రోమోని నవంబర్ 25న.. సాంగ్‌ని నవంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్లు ఆయన ట్వీట్ లో చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య, అంజలి, సునీల్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also:Koti Deepotsavam 2024: ‘కోటి దీపోత్సవం’లో 14వ రోజు.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే!
ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా 50 రోజులు మాత్రమే ఉందని కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ఓ సరికొత్త పోస్టర్ విడుదల చేశారు. సైకిల్‌పై రామ్ చరణ్ వెళ్తున్న ఈ పోస్టర్ ‘రంగస్థలం’ను గుర్తుకు చేస్తుందని అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!