IND vs AUS: ఐపీఎల్ వేలంలో ఏ టీంకు వెళ్తున్నావు..? మ్యాచ్ మధ్యలో నాథన్ లియాన్, పంత్ సంభాషణ
- బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు
- మ్యాచ్ మధ్యలో నాథన్ లియాన్, పంత్ సంభాషణ
- ఐపీఎల్ వేలంలో ఏ టీంకు వెళ్తున్నావు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ నేటి నుంచి ప్రారంభమైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్‌పైనే క్రికెట్ అభిమానులందరి దృష్టి పడింది. ఈ సిరీస్‌లో విజయం సాధించాలని ఇరు జట్ల ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో నేడు మొదటి మ్యాచ్ పెర్త్‌లో మొదలవ్వగా.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్ప కూలింది. ఇకపోతే, నవంబర్ 24, 25 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంపై ఆటగాళ్లు కూడా కన్నేసినట్లు పెర్త్ మైదానంలో ఈరోజు కనిపించింది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ గా మారింది.
Also Read: IND vs AUS: తీరుమారని టీమిండియా.. 150కే ఆలౌట్
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ వైరల్ వీడియోలో.. ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్, భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ మధ్య మైదానంలో చిన్న సంభాషణ జరిగింది. ఇద్దరు ఆటగాళ్లు మైదానంలో కాస్త ఫన్నీగా ఐపీఎల్ మెగావేలం సంబంధించి ఓ ఫన్నీ సంభాషణ జరిగింది. స్టంప్ మైక్‌లో వారి సంభాషణ రికార్డ్ కాగా వెంటనే వైరల్ అయ్యింది. తొలి రోజు తొలి సెషన్లో నాథన్ లియాన్ రిషబ్ పంత్ వద్దకు వెళ్లి ‘వేలంలో ఎక్కడికి వెళ్తున్నాం’ అని అడిగాడు. దీనిపై రిషబ్ పంత్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇందుకు ‘ నాకు తెలియదు’ అని పంత్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఈ సంభాషణ తర్వాత, ఇద్దరు ఆటగాళ్లు ఒకరినొకరు నవ్వుకున్నారు. ఆ తర్వాత పంత్ వెంటనే తన బ్యాటింగ్ ప్రారంభించాడు. ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న హైదరాబాద్ ఆటగాడు తన మొదటి ఇన్నింగ్స్ లో నితీష్ రెడ్డి 41 పరుగులతో జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు ఆస్ట్రేలియా తరపున జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు.
Also Read: IPL 2025 Auction: ఆర్ అశ్విన్‌కు రూ.8.5 కోట్లు.. ఏ జట్టు తీసుకుందంటే?
SOUND 🔛 Just two old friends meeting! 😁🤝
Don't miss this stump-mic gold ft. 𝗥𝗜𝗦𝗛𝗔𝗕𝗛-𝗣𝗔𝗡𝗧𝗜! 🤭
📺 #AUSvINDOnStar 👉 1st Test, Day 1, LIVE NOW! #AUSvIND #ToughestRivalry pic.twitter.com/vvmTdJzFFq
— Star Sports (@StarSportsIndia) November 22, 2024
తాజావార్తలు
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!