మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది. ఈసారి వేలంలో స్టార్ బ్యాటర్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సహా బౌలర్లు ఆర్ అశ్విన్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్ ఉన్నారు. అయితే గుహ కొన్నేళ్లుగా బాగా రాణించిన అశ్విన్‌ను రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకోలేదు. అతడిని ఈసారి ఏ జట్టు తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తాను ఓ ఫ్రాంచైజీకి అమ్ముడైనట్లు అశ్విన్ స్వయంగా తెలిపాడు. అయితే అతడు అమ్ముడైంది మాక్ వేలంలో అట.
Also Read: Nitish Reddy: నితీశ్ రెడ్డి లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ ఇదే.. తండ్రి భావోద్వేగం!
తాజాగా ఆర్ అశ్విన్ మాక్ వేలం నిర్వహించాడు. అందులో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ.8.5 కోట్లకు తీసుకుంది.ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ముందు షేర్ చేసిన వీడియోలో యాష్ ఈ విషయం చెప్పాడు. అశ్విన్ 2009 నుంచి 2015 వరకు చెన్నైకి ప్రాతినిధ్యం వహించాడు. చెన్నైపై నిషేధం సమయంలో రైజింగ్ పుణె జట్టులో ఆడాడు. 2017లో గాయం కారణంగా ఆడని యాష్.. ఆపై పంజాబ్ కింగ్స్‌కు వెళ్లిపోయాడు. 2018లో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆపై ఢిల్లీకి వెళ్లిన అశ్విన్.. గత మూడు సీజన్లు రాజస్థాన్‌కు ఆడాడు. ఇప్పుడు అతడు వేలంలో బరిలోకి దిగాడు. చెన్నై అశ్విన్‌ను తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. 212 ఐపీఎల్ మ్యాచులలో యాష్ 180 వికెట్స్ తీశాడు.