మెడికల్ కాలేజీలో చదువుతున్న ఓ యువతి గంజాయి అమ్మే యువకుడితో ప్రేమలో పడి మోసపోయిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. యువకుడి నేపథ్యం తెలియక ప్రేమించి పెళ్లి చేసుకోగా అతడు ఏ ఉద్యోగంలో లేడని తేలింది. అంతేకాకుండా.. యువకుడు గంజాయి అమ్ముతున్నాడని తెలుసుకుని యువతి షాక్ అయ్యింది. ఇప్పుడు ఆ యువతి డాక్టర్ కావాలనే తన కలను, భవిష్యత్ కెరీర్ ను కోల్పోయింది. సుభాష్ (25) స్వస్థలం తెన్కాసి జిల్లా కడయనల్లూరు. మధ్యలోనే చదువు మానేసిన సుభాష్‌కి చెడు స్నేహితుల సహవాసంతో ఒక సమయంలో, అతనికి గంజాయి విక్రయించే ముఠా సభ్యులతో పరిచయం ఏర్పడింది. సుభాష్ ఆదాయం కోసం పార్ట్‌టైమ్‌గా గంజాయి అమ్మడం ప్రారంభించాడు. కానీ అతను ఏమి చేస్తున్నాడో అతని తల్లిదండ్రులతో సహా ఎవరికీ తెలియదు. గంజాయి అమ్మగా వచ్చిన డబ్బులో ఖరీదైన బట్టలు వేసుకొని తిరిగేవాడు. అయితే.. ఆ సమయంలో చెన్నైలోని ఓ మెడికల్ కాలేజీలో చదువుతున్న తెంకాశికి చెందిన ఓ యువతిని సుభాష్ చూశాడు.
Also Read : Trivikram: సంయుక్త మీనన్ కి స్టేజ్ పైనే ఐ లవ్ యు చెప్పాడు… ఫాన్స్ రచ్చ చేశారు
సుభాష్ ఆ యువతిని అనుసరించి యువతికి తన ప్రేమను తెలిపాడు. సుభాష్ టిప్ టాప్ మరియు అతని బైక్ చూసి బాగా డబ్బున్న యువకుడని యువతి భావించింది. అప్పుడే, సుభాష్‌కి ఉద్యోగం లేదన్న విషయం బాలికకు తెలిసింది. అయితే, ప్రేమమైకంలో సుభాష్ తనకు త్వరలో మంచి ఉద్యోగం వస్తుందని చెప్తే నమ్మేసింది. ఆ యువతి మెడికల్ కాలేజీలో చదివేందుకు చెన్నై వెళ్లి, సెలవుల కోసం తెన్కాసి వచ్చి సుభాష్‌తో ప్రేమాయణం కొనసాగించేది. ఈ నేపథ్యంలో ఈ ప్రేమ వ్యవహారంపై యువతి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే అమ్మాయికి పెళ్లిచేసేందుకు సిద్ధమవుతుండటంతో.. తన ప్రేమ ఫలించకపోవచ్చని ఎవరికీ తెలియకుండా ఆ యువతి కొన్ని నెలల క్రితం సుభాష్‌ను పెళ్లి చేసుకుంది. వారికి తెలియకుండా పెళ్లిచేసుకోవడంతో తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదు. దీంతో చదువును కొనసాగించలేక వైద్యవిద్యను సగంలోనే వదిలేసింది.
Also Read : Atrocious Incident: కర్కశత్వం.. అత్యాచారాలు చేసి, ఇనుప సంకెళ్లతో బంధించి..
కొద్దిరోజుల క్రితం చేతిలో గంజాయి ప్యాకెట్‌తో తిరుగుతున్న సుభాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు సుభాష్ భార్యకు ఫోన్ చేసి జరిగిన వివరాలను తెలిపారు. దీంతో షాక్‌కు గురైన మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగింది. నా భర్త చాలా మంచివాడు..ఆయన గంజాయి వ్యాపారి కాదని, మీరు తనపై తప్పుడు కేసు పెట్టారని ఆ యువతి వాదించింది. ఆమె పరిస్థితిని చూసి జాలిపడి, సుభాష్ గంజాయి విక్రయాలను పోలీసులు వివరించారు. అప్పుడే తప్పుడు వ్యక్తితో ప్రేమలో పడి మోసపోయానని యువతికి తెలిసింది.