ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్) నుంచి వలస వచ్చి యుపిలోని వివిధ జిల్లాల్లో స్థిరపడిన కుటుంబాలకు తీపికబురును అందించారు. ఈ ప్రజలకు చట్టబద్ధంగా భూమిపై యాజమాన్య హక్కు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇది కేవలం భూ పత్రాలు ఇవ్వడం మాత్రమే కాదని, సరిహద్దుల అవతల నుంచి నిర్వాసితులై భారత్ లో ఆశ్రయం పొంది, గత కొన్ని దశాబ్దాలుగా…
బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ అధ్యక్షుడు చౌదరి భూపేంద్ర సింగ్ గురువారం తన రాజీనామా చేశారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అందజేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన కొద్ది రోజులకే భూపేంద్ర సింగ్ ఈ చర్య తీసుకున్నారు.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై బీజేపీ నేతలతో పాటు ప్రతిపక్ష నేతలంతా ఆయనను స్మరించుకుని నివాళులు అర్పిస్తున్నారు.
CM Yogi : దేశంలో లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి అన్ని పార్టీలు ఎన్నికల ర్యాలీలు నిర్వహించడం ప్రారంభించాయి. కాగా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం బులంద్‌షహర్, హత్రాస్, గౌతమ్ బుద్ధ నగర్‌లలో పర్యటించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
Rajasthan: ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే రాజస్థాన్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా మ్యాజిక్ ఫిగర్ దాటి 115 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. అయితే రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ విజయం మరో ‘యోగి’ ఎదుగుదలకు దారి తీసే అవకాశం ఏర్పడింది. రాజస్థాన్ యోగిగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మి నాయకుడు, అల్వార్ ఎంపీ బాబా బాలక్ నాథ్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో ఒకరుగా ఉన్నారు.
Telangana Elections 2023: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో బీజేపీ అగ్రనాయకత్వం వరుస పర్యటనలకు సిద్ధమైంది. ఈ నెల 28న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనున్న సంగతి తెలిసిందే.
మదర్సాల్లో జాతీయ గీతం, జ్ఞానవాపి మసీదు సర్వే అంశాలపై ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యాడు. యూపీలోని యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ మసీదుల్లో జాతీయగీతం జనగణమనను తప్పనిసరి చేసింది. గురువారం నుంచే యూపీలోని అన్ని మసీదుల్లో జాతీయగీతాన్ని ఆలపించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుకూలంగా వారణాసి కోర్ట్ ఇచ్చిన తీర్పుపై అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగీ ఆదిత్యనాథ్, బీజేపీ నాకు దేశభక్తి సర్టిఫికేట్…