అనారోగ్య సమస్యలతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అహ్మద్ (86) కన్నుమూశారు. అహ్మద్ 1958-73 మధ్య పాక్ తరఫున 41 టెస్టులు ఆడారు. అందులో 5 సెంచరీలు, 16 అర్ధ శతకాలతో 2991 పరుగులు చేశారు. అంతేకాకుండా.. అహ్మద్ రైట్ ఆర్మ్ స్పిన్నర్ కాగా.. 22 వికెట్లు కూడా తీశారు. ఇదిలా ఉంటే.. అహ్మద్ చేసిన 5 శతకాలలో మూడు ఇండియాపైనే నమోదు చేశారు.