Ashwin Babu: ఓంకార్ తమ్ముడు వేగం మాములుగా లేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwin Babu: బుల్లితెర యాంకర్, డైరెక్టర్ ఓంకార్ గురించి అందరికీ తెల్సిందే. ఈ మధ్యనే మ్యాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్నే అందుకున్నాడు. ఇక అన్న ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో.. తమ్ముడు అశ్విన్ ను కూడా హీరోగా నిలబెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఓంకార్. ఇక అశ్విన్ ఈ మధ్యనే హిడింబ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ మోస్తరు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత అశ్విన్ పై నిర్మాతలకు నమ్మకం పెరిగింది. ఇంకోపక్క ఓంకార్ కూడా తోడు ఉండడంతో వరుస సినిమాలతో బిజీగా మారాడు. తాజాగా అశ్విన్ కొత్త సినిమా ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
Goodachari 2: శోభితాకు చెల్లెలిగా ఉందనే తీసుకున్నావా.. శేష్ బ్రో.. ?
Also Read
గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అప్సర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాతలు సుధాకర్ రెడ్డి, ‘ఠాగూర్’ మధు, శిరీష్ రెడ్డి, ఎర్రబెల్లి విజయ్ కుమార్ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సోలో బ్రతుకే సో బెటర్ దర్శకుడు సుబ్బు మంగాదేవి కెమెరా స్విచ్ఛాన్ చేయగా… నాంది దర్శకుడు విజయ్ కనకమేడల క్లాప్ ఇచ్చారు. బింబిసార దర్శకుడు వశిష్ట తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించగా దర్శక నిర్మాత ఓంకార్ స్క్రిప్ట్ అందజేశాడు. ఈ సినిమాలో అశ్విన్ సరసన దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తుండగా.. ‘హైపర్’ ఆది ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
Sriram: భూమికను చంపేయాలనుకున్నాను.. కత్తి తీసుకొని
ఇక పూజా కార్యక్రమం తరువాత చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ “అశ్విన్ బాబుతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. హిడింబ సినిమాతో ఇటీవల ఆయన మంచి విజయం అందుకున్నారు. దాని తర్వాత మరో వైవిధ్యమైన కథతో మా సంస్థలో సినిమా చేస్తున్నారు. కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం. తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమా చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అని అన్నారు. మరి ఈ సినిమా అశ్విన్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!