YSRCP: వైసీపీకి షాక్.. పార్టీకి ఆమంచి కృష్ణమోహన్ గుడ్‌బై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల వేళ బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీకి షాక్ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేశారు. చీరాల వైసీపీ టిక్కెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఆమంచి కృష్ణమోహన్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 9న తన భవిష్యత్ ప్రకటిస్తానని ఆమంచి వెల్లడించారు. గతంలో పర్చూరు నియోజకవర్గ బాధ్యతలు నిర్వహించిన ఆమంచి కృష్ణమోహన్‌కు టికెట్ దక్కలేదు. దీంతో గత కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఆమంచి కృష్ణమోహన్. ఆమంచి కృష్ణమోహన్ 2014లో చీరాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 2019 ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు .
Read Also: Andhra Pradesh: ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు నియామకం
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
టికెట్ రాకపోవడంతోనే..
ఆమంచి కృష్ణమోహన్ ఈ ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆమంచి భావించారు. అయితే ఈ టికెట్ కరణం వెంకటేశ్‌కు ఇవ్వడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చీరాల వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన.. టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కరణం బలరాం వైసీపీలో చేరారు. దీంతో వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ మేరకు ఆమంచి కృష్ణమోహన్‌ను పర్చూరు ఇంచార్జిగా నియమించారు. అయితే ఇటీవల పర్చూరు అభ్యర్తిగా యెడం బాలాజీని నియమించారు. దీంతో వరుస ఎదురుదెబ్బలు తగలడంతో వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గురువారం పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలో కాంగ్రెస్ లో చేరతారని.. ఆ పార్టీ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!