Gold Silver Rates: పసిడి ప్రియులకు మరోసారి దిమ్మతిరిగే న్యూస్. గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్లు కనిపించినా తాజాగా మళ్లీ పెరిగాయి. గత రెండు మూడు నెలలుగా బంగారం ధరలు ఒకసారి లక్షను తాకిన తరువాత కొంత తగ్గినా, ఇప్పుడు మళ్లీ ఆ దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.99,280 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుత అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలపై సాగుతున్న చర్చలు, ఇంకా ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక పరిస్థుతుల వల్ల భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరి నేటి (జూన్ 11) నాటికి బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్లు బంగారం ధర నిన్నటి ధరతో పోలిస్తే ఏకంగా రూ. 880 పెరిగి రూ. 99,280 వద్ద ట్రేడ్ కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 800 పెరిగి రూ. 91,000 వద్ద, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 660 పెరిగి రూ. 74,460 వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు నిన్న స్థిరంగా ఉన్న వెండి ధర నేడు స్వల్పంగా తగ్గింది. కేజీ వెండిపై రూ. 100 తగ్గి రూ. 1,18,900 వద్ద హైదరాబాద్ మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది.
Read Also: Kalpika pub incident : పబ్ లో గబ్బు.. కల్పికపై కేసు