Site icon NTV Telugu

KTR: ఆ ఒక్క విషయంలో మోడీని అనుసరిస్తా.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Ktr Bandi

Ktr Bandi

కేటీఆర్ నోటీసులకు భయపడేది లేదన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉడుత ఊపులకు భయపడేది లేదని.. బండి సంజయ్ అన్నారని.. మళ్లీ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బండి సంజయ్ తనకు లీగల్ నోటీసులు ఇస్తే, తాను మళ్లీ మళ్లీ లీగల్ నోటీసులు పంపిస్తానన్నారు. రాహుల్ గాంధీకి మోడీ లీగల్ నోటీసులు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. లీగల్ నోటీసుల విషయంలో మాత్రం మోడీని అనుసరిస్తానని తెలిపారు.

READ MORE: Jammu Kashmir: విద్యార్థులకు దీపావళి గుడ్‌న్యూస్.. విద్యాసంస్థలకు 5 రోజులు సెలవులు

ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ లీగల్ నోటీసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా స్పందించారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక.. లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి కేటీఆర్ నాకు లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూశానని తెలిపారు. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరని అన్నారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందన్నారు. తాటాకు చప్పళ్లకు భయపడేది లేదన్నారు. నాపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరే.. అన్నారు. అందుకు బదులుగానే నేను మాట్లాడిన అన్నారు. ఆయన సుద్దపూస అనుకుంటున్నాడేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భాగోతం ప్రజలకు తెలుసని అన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసని అన్నారు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చిన అన్నారు. లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తా. మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులం అన్నారు. చట్టం, న్యాయం ప్రకారం కూడా ముందుకు వెళతామని తెలిపారు.

READ MORE: Actor Bala: కోట్ల ఆస్తి కోసం 4వ పెళ్లి చేసుకున్న నటుడు

Exit mobile version