ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎంగా చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువు కాటకాలు వస్తాయని ఆరోపించారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పూర్తిగా తగ్గిపోతాయి.. ఇప్పుడు మిర్చి ధర పతనం అయ్యిందన్నారు. పెట్టుబడి పెరిగిపోయింది, ఉత్పత్తి తగ్గిపోయింది అని అధికారులు ముందే చెప్పారు.. అయినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు జగన్.. మిర్చి రైతుల ఆవేదన తెలుసుకోవడానికి వస్తే గానీ ప్రభుత్వం మిర్చి రైతుల సమస్య గుర్తుకు రాలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు చంద్రబాబు కొత్త నాటకం మొదలు పెట్టారు.. ఎప్పుడైనా కేంద్రం మిర్చి కొంటుందా? అని ప్రశ్నించారు. మిర్చి రైతులతో, ట్రేడర్లతో సమావేశాలు పెట్టి కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకప్పుడు లక్షలోపు మిర్చి పెట్టుబడులు ఉండేవి.. తెగుళ్లతో ఇప్పుడు రెండులక్షల పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని తెలిపారు. చంద్రబాబు వెంటనే మిర్చి రైతుకు మద్దతు ధర ప్రకటించాలి.. మార్క్‌ఫెడ్ ను ఎందుకు రంగ లోకి దించడం లేదని ప్రశ్నించారు. తాము మూడు వేల కోట్లు ధరల స్థిరీకరణ కోసం నిధి పెట్టాం.. ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెట్టడం కాదు, మార్క్ ఫెడ్‌ను రంగంలోకి దించి, మిర్చి రైతులను ఆదుకోవాలని అంబటి రాంబాబు తెలిపారు. మ్యూజికల్ నైట్‌లు పెట్టుకుంటే వర్తించని ఎన్నికల కోడ్.. రైతులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వస్తే, ఎన్నికల కోడ్ అడ్డంకి వస్తుందా అని ప్రశ్నించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సెక్యూరిటీ తగ్గించారని అంబటి రాంబాబు తెలిపారు.
Read Also: Ramayan : రావణుడు ఆన్ డ్యూటీ
వ్యవసాయాన్ని సర్వ నాశనం చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు నాటకాలు ఆడవద్దు.. మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి మిర్చి కొనుగోళ్లు చేయాలని తెలిపారు. రైతులకు మంచి చేయకపోయిన పర్లేదు, మోసం మాత్రం చేయవద్దని సూచించారు. మిర్చి రైతుని ఆదుకోకపోతే రైతుల ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉంది.. గ్రూప్ 2 వాయిదా కోసం ప్రభుత్వం లేఖ రాస్తే ఏపీపీఎస్‌సీ పట్టించుకోలేదని కొత్త నాటకం చేశారని తెలిపారు. తమ మీద కేసులు పెట్టినా భయపడేది లేదు.. రైతుకు మేలు చేయాలన్నారు. తమ హయాంలో ఇరవై ఏడు వేల వరకు గరిష్ట ధర మిర్చి పలికింది.. కూటమి ప్రభుత్వంలో రైతులకు 30 వేలు మిర్చి ధర వచ్చేలా చేస్తే ఈ ప్రభుత్వం గొప్ప పని చేసిందని ఒప్పుకుంటామన్నారు. కనీసం క్వింటాలుకు పదిహేను వేలు చెల్లించి మార్క్ ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేయాలని పేర్కొ్న్నారు. మిర్చికి కనీస మద్దతు ధర వెంటనే ప్రకటించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
Read Also: IND vs PAK: ఓడీఐలో అత్యధిక క్యాచ్‌లు.. సరికొత్త రికార్డు నెలకొల్పిన కింగ్ ‘కోహ్లీ’
జగన్ మోహన్ రెడ్డికి ఎవరి దయా దాక్షిణ్యాలతో సెక్యూరిటీ ఇవ్వడం లేదు.. మాజీ ముఖ్యమంత్రిగా జగన్‌కు ఆ సెక్యూరిటీ వస్తుంది.. కానీ నోటీసు ఇవ్వకుండా z+ సెక్యూరిటీని ఉపసంహరిస్తే.. జరగరానిది ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకోవాలని అంబటి రాంబాబు ప్రశ్నించారు. తాము ఎక్కడ ప్రశ్నించాలో అక్కడ ప్రశ్నిస్తామని అన్నారు. దానికి రాష్ట్ర డీజీపీ వచ్చి సమాధానం చెప్పాలని తెలిపారు. కక్ష్యతో ఐపీఎస్ అధికారులు ఉద్యోగాలు చేస్తే ఏం చేయాలో అదే చేస్తామన్నారు. జగన్‌కు 12 గంటల పాటు z+ రక్షణ ఉపసంహరించారు అన్న విషయం తెలుసుకుని గవర్నర్ ఆశ్చర్యపోయారని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలలో తాము పోటీ చేయడం లేదని తెలిపారు. కానీ తమకు మద్దతుగా ఉన్న ఓటర్లు, కూటమి అభ్యర్ధులను ఓడించాలని అన్నారు. దుర్మార్గమైన కూటమి అభ్యర్థులు ఓటమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా.. ఉద్యోగ కల్పన చేయకుండా.. గ్రూప్ 2 అభ్యర్ధులను మోసం చేసిన కూటమి అభ్యర్థులని ఓడించాలని అంబటి రాంబాబు వెల్లడించారు.