NTV Telugu Site icon

Ambati Rambabu: పవన్ కళ్యాణ్ ఉపన్యాసం కనీసం ఆయనకైనా అర్థమైందో.. లేదో!

Ambati Rambabu

Ambati Rambabu

పిఠాపురం జనసేనకు పుష్కర కాలం తర్వాత ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించారని.. పవన్ కళ్యాణ్ తొలిసారి శాసనసభకు గెలిచిన తర్వాత తొలిసభ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.. ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సభ కోసం ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూశారన్నారు.. పవన్ కళ్యాణ్ రెండు గంటల పాటు ఒక సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారని.. ఆ ఉపన్యాసం కనీసం ఆయనకైనా అర్థమైందో.. లేదో అంటూ విమర్శించారు. “ఒక్క మాట చెప్పారు.. నిలబడ్డాం.. టీడీపీని నిలబెట్టాం.. అన్నారు.. చంద్రబాబు ఓ బీ టీంగా జనసేనను వదిలారు.. పవన్ కళ్యాణ్ ను అడ్డం పెట్టుకుని కాపులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు.. 100 శాతం స్ట్రైక్ రేట్ అని చెప్పుకున్నారు.. అక్కడ ఉన్నవాళ్లలో ఎక్కువ మంది టీడీపీ పంపిన వాళ్ళే…మేము రిజెక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది.. వాళ్ళు మీ వాళ్ళు కాదని గుర్తుంచుకోవాలి.. 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటారు.. నాకు రాజకీయాల్లోకి వచ్చి ఆరోగ్యం చెడగొట్టుకున్నాను అని చెప్పారు.. ఆయనకేమైనా డబ్బులు లేవా.. ఆరోగ్యం ఎందుకు పాడైంది..” అని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.

READ MORE: BJP: ‘‘ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్’’.. ‘‘కాంగ్రెస్ ఒక ముస్లింలీగ్’’

ఒకసారి మా ఇంట్లో రామ నామ స్మరణ ఉంటుందని చెప్పారని.. ఆయనకు గుర్తుందో లేదో గతంలో మా నాన్న హేతువాది అని ఓసారి చెప్పారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. హామీల సంగతి ఏమైనా చెప్పారా? అని ప్రశ్నించారు. వైసీపీని ధీటుగా ఎదుర్కొంటాం.. మేం అధికారంలోకి వస్తాం అని మాట్లాడారా? అని విమర్శించారు.. ఉత్తరాది వారి అహంకారం అని మాట్లాడిన వ్యక్తి.. ఇప్పుడు వారికీ సహకారిగా మారారన్నారు.. ఆయన సిద్ధాంతం ఏంటో.. ఎక్కడ మొదలై.. ఎక్కడకు వెళ్తున్నారో ఆయనకే తెలియదని చెప్పారు.. “జయకేతనం అని సభ పెట్టీ.. మీరు మాట్లాడింది ఏంటి.. ఊసరవెళ్లి లాగా మారిపోతున్నారు.. మెడికల్ కళాశాలలు మొత్తం ప్రైవేట్ వారికి అప్పగించాలని చూస్తున్నారు.. అసలు జనసేన శాసనసభకు దోపిడీ జరుగుతుంటే చూస్తూ కూర్చున్నారు.. ఆయనకు ప్రియమైన మంత్రి పనే కలెక్షన్ చేయటం.. సీజ్ ది షిప్ అన్నారు.. సముద్రంలోకి వెళ్ళారు.. వచ్చారు.. ఏం సాధించారు.. ఒకసారి టీడీపీకి సపోర్ట్ చేస్తారు.. మరోసారి జత కడతారు.. అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు.. నాలుగు భాషల్లో మాట్లాడిన పవన్ ఉత్తరాదికి అనుకూలమైన దక్షిణాది నాయకుడిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.. వారసత్వ రాజకీయాలు ఏంటి అని ప్రశ్నిస్తారు.. కానీ సీటు ఖాళీ అయితే తన అన్నకు ఇస్తారు..” అని మాజీ మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.