రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు అవసరం.. ఏపీ పోలీస్ నేర నియంత్రణలో ముందుంది.. ఆధునిక సాంకేతికతో ఏపీ పోలీసులు ముందుకు వెళ్తున్నారు అని మంత్రి అనిత పేర్కొనింది.
విజిబుల్, ఇన్విజిబుల్ పోలీసింగ్ ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. పోలీసులు కూడా కొత్త వెర్షన్ గా మారి ముందుకు వెళ్ళాలి.. నేరస్తులు ఇంటెలిజెంట్ క్రైమ్స్ చేస్తున్నారు.. వారి కంటే ముందుంటే తప్ప వారిని కట్టడి చేయలేం అన్నారు. గూగుల్ పెట్టుబడి వైజాగ్ రావటానికి కారణం లా అండ్ ఆర్డర్.
Womens Protest: గుంటూరు ఎస్పీ కార్యాలయం ముందు మహిళల ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అనుచరులు తమపై దాడి చేసి ఇబ్బంది పెట్టారంటూ కోటేశ్వరమ్మ అనే మహిళ ఆమె కూతురుతో కలిసి ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తమపై దాడి జరిగిందని మేడికొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే, సీఐ దురుసుగా వ్యవహరిస్తున్నారు అని బాధిత మహిళలు పేర్కొంటున్నారు.
AP Assembly: గత ప్రభుత్వ హయాంలో జగన్‌ను సినీ ప్రముఖులు కలిసిన అంశంపై ఏపీ అంసెబ్లీలో మాటల యుద్ధం జరిగింది. కామినేని శ్రీనివాస్ vs మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. లా అండ్ ఆర్డర్‌పై మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. అపట్లో జగన్ ఇంటికి కొంత మంది సినీ ప్రముఖులు వచ్చారు. అప్పుడు జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా..
Narayana Swamy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాలను కూటమి ప్రభుత్వం అరికట్టలేకపోతున్నదంటూ చిత్తూరులో వైస్సార్సీపీ మహిళా విభాగం నేతలు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరు చూస్తుంటే మనం భారతదేశంలో ఉన్నామా..? లేక పాకిస్తాన్‌లో ఉన్నామా..? అన్న అనుమానం కలుగుతోంది. ఏపీలో ప్రజలు నార్త్ కొరియా తరహా పాలనను అనుభవిస్తున్నారని తీవ్రస్థాయిలో…
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వాన్ని నిలదీస్తూ దీనిపై సోషల్ మీడియాలో వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. రాజకీయ కక్షలతో చంద్రబాబు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది.