హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ పై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. బిగ్ బాస్కెట్ స్టోర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి.. పలు లోపాలను గుర్తించారు. స్టోరేజ్ లో సరైన ప్రమాణాలను పాటించకపోవడంతో పాటు ఎక్స్పైరీ అయిపోయిన వస్తువులను గుర్తించారు. 5 కు పైగా పదార్థాలను ఎక్స్పైరీ అయినట్లు తేల్చారు. పాడైన అరటి పళ్ళు, సపోటా పళ్ళను గుర్తించి వాటిని పారవేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది హలో పదార్థాల శాంపిల్స్ సైతం సేకరించారు. అధికారుల నివేదిక ప్రకారం.. శేర్లింగంపల్లి జోన్ పరిధిలోని మజీద్ బండలో ఉన్న బిగ్ బాస్కెట్ స్టోర్ లో కూల్ డ్రింక్స్, ఫ్లేవర్డ్ మిల్క్ బాటిల్స్ ని రికమండేషన్ ప్రకారం సూచించిన పద్ధతిలో స్టోర్ చేయలేదు. సానిటరీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ని పక్కపక్కనే స్టోర్ చేశారు. ఫుడ్ హ్యాండిలర్స్, వెజిటబుల్ హ్యాండిలర్స్ కి గ్లౌజులు, ఆప్రాన్స్ లేవు. పాల సీసాలు (10), చిక్కటి షేక్ సీసాలు (5), స్టింగ్ టిన్ బాటిళ్లు (50) తయారీదారు నిల్వ పరిస్థితుల ప్రకారం ఉంచలేదు. గడువు ముగిసిన చికెన్ మసాలా, పిజ్జా చీజ్, పనీర్, ఐస్‌క్రీమ్‌లు, ఆల్మండ్ ఫడ్జ్ లు ఉన్నాయి.
READ MORE: Israel-Gaza: అంతర్జాతీయ కోర్టు సంచలన తీర్పు.. రఫాపై తక్షణమే దాడులు ఆపాలని ఆదేశం
ఈ అంశాలను గుర్తించిన టాస్క్ ఫోర్స్ అధికారులు శేర్లింగంపల్లి జోన్ పరిధిలోని మజీద్ బండలో ఉన్న బిగ్ బాస్కెట్ స్టోర్ లైసెన్స్ సస్పెండ్ చేశారు. ప్రజా ఆరోగ్య దృష్ట్యా మరికొన్నాళ్లపాటు ఇలాగే దాడులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఇదే కాకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లను నిశితంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటి వరకు వందకు పైగా హోటల్లో రెస్టారెంట్లు ఫుడ్ సరఫరా సంస్థలను తనిఖీ చేశారు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు. 55 హోటల్స్, రెస్టారెంట్లు ఫుడ్ సరఫరా సంస్థల్లో లోపాలను గుర్తించారు. జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ వాటిపై చర్యలకు ఉపక్రమించింది. వీటి నివేదికలను త్వరలో ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.