Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. భారత పైలట్ సాహసంతో విమానం ప్రమాదం నుంచి బయటపడింది. ఒమన్ జాతీయుడైన కో-పైలట్ దాడి చేసి, విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. అయితే, ఇప్పుడు ఈ ఘటనలకు ఉగ్రసంస్థ అల్‌ఖైదా మద్దతు తెలిపింది. యుద్ధం ఇంకా ముగియలేదని చెబుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ ప్రజలు ప్రయాణించే విమానాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడులు చేస్తామని హెచ్చరించింది. అమెరికాపై 2001లో జరిగిన 9/11 దాడులను కూడా అల్‌ఖైదా అనుకూల వారపత్రిక ‘అల్-బయాన్’ ప్రస్తావించింది.
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి, కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసిన ఘటనను 9/11 దాడులతో పోలుస్తూ వ్యాఖ్యలు చేసింది. అమెరికన్లు, ఇజ్రాయిలీలుల ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని, ఇప్పటికీ వీరు ప్రయాణిస్తున్న చాలా విమానాలు ఆకాశంలో ఉన్నాయని హెచ్చరించింది. యూఎస్ రాజ్యం చివరకు అంతమవుతుందని చెప్పింది. అమెరికా, ఇజ్రాయిల్‌లకు గతంలో కన్నా ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని అల్ బయాన్ పేర్కొంది. ఇదిలా ఉంటే, నిందితుడైన కో పైలట్ హమ్మామి సోషల్ మీడియాలో అల్‌ఖైదా నేతలు ఒసామా బిన్ లాడెన్, అల్ జవహరిల ప్రస్తావన ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!