Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill ODI Player of the Series Record: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్ 334 పరుగులు చేసి.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి వన్డేలో 108 బంతుల్లో 110 రన్స్ చేసిన ప్రిన్స్.. రెండో వన్డేలో 133 బంతుల్లోనే 223 పరుగులు చేశాడు. మూడో వన్డేలో 1 పరుగుతో గిల్ నిరాశపరిచినా.. భారత క్రికెట్లో ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
భారత్ తరఫున అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో శుభ్‌మన్ గిల్ ఇప్పుడు సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 15 అవార్డులతో అగ్రస్థానంలో ఉండగా.. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ 11 అవార్డులతో రెండో స్థానంలో ఉన్నాడు. మాజీ దిగ్గజాలు యువరాజ్ సింగ్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ తలో ఏడు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులతో మూడో స్థానంలో ఉన్నారు. తాజాగా ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన గిల్ చేరాడు.
Also Read
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
- India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
అయితే శుభ్‌మన్ గిల్ సాధించిన ఏడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుల్లో ఓ ప్రత్యేకత ఉంది. అతడి ఏడు అవార్డులన్నీ 2022 తర్వాతే రావడం విశేషం. అదే సమయంలో 2022 నుంచి ఇప్పటివరకు మరే భారత ఆటగాడు మూడు కంటే ఎక్కువ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు అందుకోలేదు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో గిల్ ఎంత నిలకడగా రాణిస్తున్నాడో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం 70 మ్యాచ్‌లకే గిల్ దిగ్గజాల సరసన చోటు సంపాదించడం అంటే మాములు విషయం కాదు. ఓవైపు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు బ్యాటర్‌గా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇదే స్థాయిలో ప్రిన్స్ బ్యాటింగ్ కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.
భారత్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు (వన్డే):
15 సచిన్ టెండూల్కర్
11 విరాట్ కోహ్లీ
7 యువరాజ్ సింగ్
7 సౌరవ్ గంగూలీ
7 ఎంఎస్ ధోనీ
7 శుభ్‌మన్ గిల్
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!