Prakasam Barrage Flood Alert: ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద నీరు ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదకు అనుగుణంగా అధికారులు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. బ్యారేజీ ఎగువన, దిగువన ప్రాంతాలకు వరద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీకి రేపు మధ్యాహ్నానికి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పులిచింతల నుంచి 65 వేల క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల చేస్తున్నారు. రేపు మధ్యాహ్నానికి ప్రకాశం బ్యారేజికి 3లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుందని అంచనా వేశారు.. రెవెన్యూ, పోలీసు, రక్షణ, భద్రతా, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఇతర అధికారులకు ఇరిగేషన్ అధికారులు అలర్ట్ జారీ చేశారు. వరద నీటిలో ఈతకెళ్లడం, చేపలు పట్టడం, నాటుపడవలో ప్రయాణించ వద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
READ MORE: Kaleshwaram Commission Report: సీల్డ్ కవర్‌లో కాళేశ్వరం కమిషన్ నివేదిక.. 3 వేల పేజీలతో డాక్యుమెంట్!