Ajith Kumar : అజిత్ హీరోగా అనిల్ సుంకర నిర్మాతగా భారీ బడ్జెట్ సినిమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా గతేడాది వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అయితే గత కొంతకాలంగా అజిత్ నెక్ట్స్ సినిమా ఏంటనే చర్చ నడుస్తోంది. అయితే డైరెక్టర్ ఆధిక్ ఇప్పుడు అజిత్ కోసం మరో పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ‘AK64’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది.
Also Read : Varanasi : వారణాసి లేటెస్ట్ అప్డేట్.. జార్జియాకు టికెట్ బుక్ చేసుకున్న మహేశ్ బాబు
Also Read
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ (AK Entertainments) నిర్మించబోతుందట. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ వ్యయంతో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అజిత్ ఇమేజ్‌కు తగ్గట్టుగా అధిక్ రవిచంద్రన్ ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వినిపిస్తోంది. అజిత్ చిత్రం కోసం అజిత్ ఏకంగా రూ. 170 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారట. ఒక టాలీవుడ్ నిర్మాణ సంస్థ తమిళ హీరోకు ఈ స్థాయి రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సక్సెస్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘AK64’పై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయండంలో సందేహమే లేదు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!