PCB financial Crisis: భారత్‌తో మ్యాచ్ రద్దైతే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఎన్ని వందల కోట్ల నష్టమో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PCB financial Crisis: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు గడ్డుకాలం ఎదురవ్వనుంది. తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం.. ఆర్థికంగా పీసీబీని పెద్ద సంక్షోభంలోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పీసీబీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఒక్క నిర్ణయం వల్లే పాకిస్థాన్ క్రికెట్‌కు వచ్చే డబ్బు నిలిపివేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐసీసీకి సంబంధించిన నాలుగేళ్ల ఆదాయ చక్రంలో పీసీబీకి 5.75 శాతం వాటా ఉంది. ఈ వాటా ద్వారా పాకిస్థాన్‌కు ఏటా సుమారు 3.45 కోట్ల డాలర్లు, అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.285 నుంచి 290 కోట్ల రూపాయల వరకు వస్తున్నాయి. పీసీబీకి వచ్చే ఆదాయంలో ఇది అత్యంత కీలకమైన వనరు. ఒకవేళ ఐసీసీ ఈ డబ్బును నిలిపివేయడం గానీ, ఫ్రీజ్ చేయడం గానీ చేస్తే.. పీసీబీ ఖజానాకు భారీ షాక్ తగిలినట్లే అవుతుంది.
READ MORE: AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. 30కి పైగా అంశాల ఎజెండాతో భేటీ..
Also Read
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
2025–26 కాలానికి సంబంధించి పీసీబీ మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.455 నుంచి రూ.458 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. దీంతో ప్రపంచంలోనే టాప్ నాలుగు ధనిక క్రికెట్ బోర్డుల్లో ఒకటిగా కొనసాగుతోంది. అయితే కొన్ని అంచనాలు మాత్రం పీసీబీ విలువ ఇంకా ఎక్కువగా, దాదాపు 1,500 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ద్వారా వచ్చే ఆదాయం, అంతర్జాతీయ ప్రసార హక్కుల నుంచి వచ్చే డబ్బుగా చెబుతున్నారు. తాజాగా భారత్ మ్యాచ్ బహిష్కరణ నిర్ణయం వల్ల పాకిస్థాన్ క్రికెట్‌కు ఉన్న మూడు ప్రధాన ఆదాయ మార్గాలూ ప్రమాదంలో పడినట్లయ్యాయి. మొదటి సమస్య ఏంటంటే.. ఐసీసీ ఏదైనా చర్య తీసుకుని పీసీబీపై శిక్షలు విధిస్తే, ఏటా వచ్చే రూ.280 కోట్లకు పైగా ఆదాయం ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇది పీసీబీ రోజువారీ ఖర్చులకూ భారీ దెబ్బ తగులుతుంది.
రెండో సమస్య ద్వైపాక్షిక సిరీస్‌లు. ఇప్పటికే పాకిస్థాన్, భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో పోలిస్తే తక్కువ హై-విలువ సిరీస్‌లే ఆడుతోంది. ఇప్పుడు ఈ వివాదం కారణంగా ఇతర క్రికెట్ బోర్డులు దూరంగా ఉంటే, పాకిస్థాన్ అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ మరింత తగ్గిపోతుంది. దాంతో టీవీ హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు తగ్గి వందల కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. మూడోది, పాకిస్థాన్ సూపర్ లీగ్‌కు అతి పెద్ద దెబ్బ తగులుతుంది. పీఎస్ఎల్ పీసీబీకి ప్రధాన ఆదాయ వనరు. ఈ లీగ్ ద్వారా సుమారు 5 బిలియన్ రూపాయల ఆదాయం వస్తోంది. కానీ ఐసీసీ సంబంధిత సమస్యలు తలెత్తి, విదేశీ ఆటగాళ్లకు అనుమతులు రాకపోతే.. పీఎస్ఎల్‌లో స్టార్ ఆటగాళ్లే కనిపించరు. అప్పుడు లీగ్ ఆకర్షణ తగ్గుతుంది. స్పాన్సర్లు వెనక్కి తగ్గుతారు. టీవీ హక్కుల విలువ పడిపోతుంది. స్టేడియాల్లో ప్రేక్షకుల సంఖ్య సైతం తగ్గుతుంది. ఇవన్నీ కలిపి పీసీబీకి భారీ నష్టాన్ని మిగులుస్తాయి. మొత్తంగా చూస్తే, భారత్ మ్యాచ్‌ను బహిష్కరించడం ఒక రాజకీయ నిర్ణయంలా కనిపించినా, దాని ప్రభావం మాత్రం నేరుగా పాకిస్థాన్ క్రికెట్ ఖజానాపై పడుతోంది.
తాజావార్తలు
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..