భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి టీం ఇండియా నెట్ రన్ రేట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. సెమీఫైనల్స్‌కు చేరుకునే భారత ఆశలను దెబ్బతీసింది. ఈ ఓటమి వెనుక గల కారణాలు ఏంటి? ఆ వివరాలు మీకోసం..
బౌలర్ల పేలవమైన ప్రదర్శన
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించలేదు. దక్షిణాఫ్రికా టాప్ బ్యాట్స్‌మెన్‌లలో ముగ్గురు 20 పరుగుల వద్ద అవుటయ్యారు. భారత బౌలర్లు సఫారీలపై ఒత్తిడిని కొనసాగిస్తారని భావించారు. కానీ మిల్లర్, బ్రెవిస్ ఒత్తిడిని అధిగమించి దూకుడుగా బ్యాటింగ్ చేసి 97 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.
స్పిన్నర్ల అపజయం
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారత స్పిన్నర్లను ధాటిగా ఎదుర్కొంది. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 47 పరుగులు సమర్పించుకోగా, సుందర్ 2 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చాడు. స్పిన్నర్లు ఒక వికెట్ మాత్రమే పడగొట్టారు.
హార్దిక్ చివరి ఓవర్
చివరి ఓవర్లో హార్దిక్ 20 పరుగులు ఇచ్చాడు. ఒకానొక సమయంలో, భారత్ దక్షిణాఫ్రికాను 175 పరుగులకే పరిమితం చేస్తుందని అనిపించింది. కానీ హార్దిక్ ఓవర్ 188 పరుగుల టార్గెట్ కు కారణమైంది. ఇది భారత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచింది.
అభిషేక్ మళ్ళీ పరాజయం, ఓపెనర్లు విఫలమయ్యారు.
ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు మరోసారి నిరాశపరిచారు. తొలి ఓవర్లోనే ఇషాన్ పరుగులు చేయకుండానే ఔటయ్యాడు. ఆ తర్వాత తిలక్ కూడా ఔటయ్యాడు. అభిషేక్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని భావించారు, కానీ15 పరుగులకే ఔటయ్యాడు.
బ్యాటర్ల ఆట తీరుపై ప్రశ్నలు
ప్రతి భారత బ్యాట్స్‌మన్ మొదటి బంతి నుంచే సిక్స్ కొట్టాలని అనుకున్నట్లు అనిపించింది. పిచ్‌ను అర్థం చేసుకోవడానికి కూడా ఎవరూ ప్రయత్నించలేదు. బంతి అభిషేక్ బ్యాట్‌పైకి రాలేదు. కాబట్టి ప్లేయర్స్ తమకు తాము సమయం ఇచ్చుకుని, భాగస్వామ్యాలను నిర్మించుకుని, సింగిల్స్, డబుల్స్‌పై దృష్టి పెట్టాల్సింది. కానీ ప్రతి బంతిని భారీ షాట్‌లతో ఆడాలని కోరుకున్నారు, తద్వారా వికెట్లను కోల్పోయారు. ఇషాన్, తిలక్, సుందర్‌లకు ఇలాగే ఔటయ్యారు.
సుందర్ విఫలం
ఈ మ్యాచ్‌లో భారత్ అక్షర్ స్థానంలో సుందర్‌ని తీసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమయ్యాడు. సుందర్‌కి రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడానికి అనుమతి ఇచ్చారు. అందువల్ల, ఈ ప్రయోగం కూడా ఘోరంగా విఫలమైంది.
