India vs South Africa: అభిషేక్ మళ్ళీ ఫెయిల్.. టీమిండియా ఓటమికి ఐదు కారణాలు!
- భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్
- టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం
- ఈ ఓటమి టీం ఇండియా నెట్ రన్ రేట్‌ను తీవ్రంగా ప్రభావితం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి టీం ఇండియా నెట్ రన్ రేట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. సెమీఫైనల్స్‌కు చేరుకునే భారత ఆశలను దెబ్బతీసింది. భారత బ్యాటింగ్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ప్రోటీస్ జట్టుకు మిల్లర్ హీరోగా నిరూపించుకున్నాడు. 35 బంతుల్లో 63 పరుగులు చేసి, మ్యాచ్ స్థితిని పూర్తిగా మార్చాడు. ఈ ఓటమి వెనుక గల కారణాలు ఏంటి? ఆ వివరాలు మీకోసం..
బౌలర్ల పేలవమైన ప్రదర్శన
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించలేదు. దక్షిణాఫ్రికా టాప్ బ్యాట్స్‌మెన్‌లలో ముగ్గురు 20 పరుగుల వద్ద అవుటయ్యారు. భారత బౌలర్లు సఫారీలపై ఒత్తిడిని కొనసాగిస్తారని భావించారు. కానీ మిల్లర్, బ్రెవిస్ ఒత్తిడిని అధిగమించి దూకుడుగా బ్యాటింగ్ చేసి 97 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.
స్పిన్నర్ల అపజయం
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారత స్పిన్నర్లను ధాటిగా ఎదుర్కొంది. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 47 పరుగులు సమర్పించుకోగా, సుందర్ 2 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చాడు. స్పిన్నర్లు ఒక వికెట్ మాత్రమే పడగొట్టారు.
హార్దిక్ చివరి ఓవర్
చివరి ఓవర్లో హార్దిక్ 20 పరుగులు ఇచ్చాడు. ఒకానొక సమయంలో, భారత్ దక్షిణాఫ్రికాను 175 పరుగులకే పరిమితం చేస్తుందని అనిపించింది. కానీ హార్దిక్ ఓవర్ 188 పరుగుల టార్గెట్ కు కారణమైంది. ఇది భారత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచింది.
అభిషేక్ మళ్ళీ పరాజయం, ఓపెనర్లు విఫలమయ్యారు.
ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు మరోసారి నిరాశపరిచారు. తొలి ఓవర్లోనే ఇషాన్ పరుగులు చేయకుండానే ఔటయ్యాడు. ఆ తర్వాత తిలక్ కూడా ఔటయ్యాడు. అభిషేక్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని భావించారు, కానీ15 పరుగులకే ఔటయ్యాడు.
బ్యాటర్ల ఆట తీరుపై ప్రశ్నలు
ప్రతి భారత బ్యాట్స్‌మన్ మొదటి బంతి నుంచే సిక్స్ కొట్టాలని అనుకున్నట్లు అనిపించింది. పిచ్‌ను అర్థం చేసుకోవడానికి కూడా ఎవరూ ప్రయత్నించలేదు. బంతి అభిషేక్ బ్యాట్‌పైకి రాలేదు. కాబట్టి ప్లేయర్స్ తమకు తాము సమయం ఇచ్చుకుని, భాగస్వామ్యాలను నిర్మించుకుని, సింగిల్స్, డబుల్స్‌పై దృష్టి పెట్టాల్సింది. కానీ ప్రతి బంతిని భారీ షాట్‌లతో ఆడాలని కోరుకున్నారు, తద్వారా వికెట్లను కోల్పోయారు. ఇషాన్, తిలక్, సుందర్‌లకు ఇలాగే ఔటయ్యారు.
సుందర్ విఫలం
ఈ మ్యాచ్‌లో భారత్ అక్షర్ స్థానంలో సుందర్‌ని తీసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమయ్యాడు. సుందర్‌కి రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడానికి అనుమతి ఇచ్చారు. అందువల్ల, ఈ ప్రయోగం కూడా ఘోరంగా విఫలమైంది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!