Hyderabad: షాద్ నగర్ లో సినిమా స్టైల్ లో మర్డర్.. ఐదుగురు అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షాద్ నగర్ లో దారుణం జరిగింది. తన కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తున్నారని కరుణ కుమార్ అనే యువకుడిని రంజిత్ కుమార్ హత్య చేశాడు. బీహార్ కు చెందిన చంద్రకుమార్ అనే సినిమాను అదే స్టైల్ లో కరుణ కుమార్ అనే యువకుడిని రంజిత్ హతమార్చాడు. శంషాబాద్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలో నివాసం ఉంటుంది. అయితే, గత నెల 29 తేదిన కరుణ కుమార్ మిస్సింగ్ అయ్యాడని తన అన్న దీపక్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. అయితే, విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.
Read Also: Vijay Antony: విజయ్ కూతురు ఆత్మహత్య.. ప్రభాస్ నిర్మాతల కీలక నిర్ణయం
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
అయితే, రంజిత్ కుమార్ అనే వ్యక్తి కరుణ కుమార్ ను హత్య చేయాలని పక్కా ప్లాన్ ప్రకారం ప్రణాళిక రూపొందించి.. గత నెల 15 వ తేదీన కేశంపేట మండలంలోని నిడదవెళ్లి గ్రామం నుంచి జూలపల్లి వెళ్లే రోడ్డులో వరి చేను పొలం దగ్గరికి కరుణ కూమార్ ను పిలిపించుకొని కాళ్లు చేతులు కట్టేసి.. వరి చేను నీటి బురదలో తలకాయ ముంచి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అదే బురదలో పాతిపెట్టి వెళ్లిపోయారు అని డీసీపీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: 3 Ekka: 20 రోజుల్లో 25 కోట్లు.. రికార్డులు బద్దలు కొడుతున్న గుజరాతీ సినిమా
అయితే రంజిత్ కుమార్ కూతురు విషయంలో కరుణ కుమార్ అసభ్యంగా ప్రవర్తించేవాడని తన కూతురు నుదుటిపై సింధూరం లాంటి బొట్టు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తమ పరువు ఎక్కడ పోతుందోననే భయంతో ఈ హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో నిందితులపై 302, 201, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులను రిమాండ్ కు తరలించారు. ఈ హత్య కేసులో రంజిత్ తో పాటు మంతోష్ కుమార్, దబ్లు కుమార్ అనే వ్యక్తులను కూడా అరెస్టు అయ్యారు. అయితే, మొత్తం ఐదుగురు నిందితులు ఉండగా ఇద్దరు మైనర్లు కావడంతో వారి వివరాలను మీడియాకు వెల్లడించేందుకు డీసీపీ నారాయణ రెడ్డి నిరాకరించాడు. మైనర్లను జువైనల్ హోమ్ కు తరలించినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!