Encounter In Jammu: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. మరో ఇద్దరిని ప్రాణాలతో పట్టుకుంది సైన్యం. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల కథనం ప్రకారం, కుల్గాం జిల్లాలోని కద్దర్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ మొదలైందని, సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఐదుగురు ఉగ్రవాదులను సైనికులు మట్టుపెట్టారని, అలాగే ఇద్దరిని ప్రాణాలతో పట్టుకున్నారని అధికారులు తెలిపారు.…