రాజస్థాన్ లో కాంగ్రెస్ మొదటి జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో హస్తం పార్టీ 33 మంది అభ్యర్థులను ప్రకటించింది. విడుదలైన తొలి జాబితాలో సీఎం అశోక్ గెహ్లాట్ సర్దార్‌పురా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ టోంక్ నుండి పోటీ చేయనుండగా.. లక్ష్మణ్‌గఢ్ అభ్యర్థిగా రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసారాలు ఎన్నికల బరిలో ఉన్నాడు. సీపీ జోషికి నాథ్‌ద్వారా నుంచి టికెట్ లభించింది.
Read Also: Motkupalli: మోత్కుపల్లి హైడ్రామా.. పురుగుల మందు డబ్బాతో ఎన్టీఆర్ ఘాట్కు
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో సచిన్ పైలట్ వర్గానికి చెందిన నలుగురు నేతలకు టిక్కెట్లు లభించాయి. ఇందులో ఇంద్రజ్ సింగ్ గుర్జార్, రామ్‌నివాస్ గవారియా, ముఖేష్ భాకర్ మరియు అమిత్ చాచన్ పేర్లు ఉన్నాయి. అంతేకాకుండా.. చాలా మంది మహిళా అభ్యర్థులకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. ఫస్ట్ లిస్ట్ లో రీటా చౌదరి, డాక్టర్ అర్చన శర్మ, మమతా భూపేష్, మంజు దేవి, దివ్య మదెర్నా, మనీషా పన్వర్ మరియు ప్రీతి గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారు. మరోవైపు గత సారి ఎమ్మెల్యేలపైనే కాంగ్రెస్ ఎక్కువగా విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే ముండావర్ నుంచి లలిత్ యాదవ్‌కు పార్టీ టిక్కెట్ ఇచ్చింది. లలిత్ యాదవ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ టికెట్‌పై పోటీ చేశారు.
Read Also: Israeli–Palestinian conflict: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఇరాన్ ఎంటరైతే..!
రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 25న ఓటింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే రాజస్థాన్‌లో మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. ఈసారైనా అధికారాన్ని చేజిక్కించుకువాలని బీజేపీ చూస్తుంది.