బీహార్‌లో ప్రధాన పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ సాగబోతుంది. ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి.. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రతిపక్ష కూటమి తహతహలాడుతున్నాయి.
మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో పొత్తు చర్చలు సఫలీకృతం అయ్యాయి. సీట్ల షేరింగ్‌పై కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చాయి. మూడు పార్టీలు కూడా రాష్ట్రంలోని 288 సీట్లకు గానూ ఒక్కో పార్టీ 85 స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయించారు.
జార్ఖండ్‌లో బీజేపీ దూకుడుగా ఉంది. శుక్రవారం పొత్తులు ఖరారు చేసుకుంది. గంటల వ్యవధిలోనే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసేసింది. శనివారం సాయంత్రం 66 మందితో కూడిన తొలి జాబితాను కమలం పార్టీ విడుదల చేసింంది.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం బీజేపీ విడుదల చేసింది. అయితే.. నాటకీయ పరిణామాల మధ్య ఈ జాబితాను ఉపసంహరించుకుంది. కొన్ని గంటల తర్వాత సవరించిన జాబితాను మళ్లి విడుదల చేసింది.
రాజస్థాన్ లో కాంగ్రెస్ మొదటి జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో హస్తం పార్టీ 33 మంది అభ్యర్థులను ప్రకటించింది. విడుదలైన తొలి జాబితాలో సీఎం అశోక్ గెహ్లాట్ సర్దార్‌పురా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ టోంక్ నుండి పోటీ చేయనుండగా.. లక్ష్మణ్‌గఢ్ అభ్యర్థిగా రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసారాలు ఎన్నికల బరిలో ఉన్నాడు. సీపీ జోషికి నాథ్‌ద్వారా నుంచి టికెట్ లభించింది.
రేపు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. అందులో 58 మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్ ఉంటుందన్నారు. మిగతా అభ్యర్థులను మరో రెండ్రోజుల్లో ఖరారు చేస్తామని పేర్కొన్నారు. గెలుపు, విధేయతకు ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. మరోవైపు వామపక్షాలతో పొత్తులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. పొత్తులపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అయితే రేపు అభ్యర్థుల జాబితా విడుదల కానుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
దేశంలోని ఖాళీగా ఉన్న 57 రాజ్యసభ స్థానాలకు బీజేపీ ఆదివారం నాడు తన తొలి జాబితాను ప్రకటించింది. వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభ అభ్యర్థులను ఆ పార్టీ బరిలో దించుతోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. మరో కేంద్రమంత్రి పియూష్ గోయల్‌కు మహారాష్ట్ర నుంచి అవకాశం కల్పించారు. రాజ్యసభలో ఖాళీ అయిన 57 స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి. Sidhu Moose Wala: పంజాబీ సింగర్ దారుణ హత్య కర్ణాటక…