యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో తొలి హిందూ దేవాలయం నిర్మితమైంది. బుధవారం ఈ ఆలయం ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ (PM Modi) మంగళవారం యూఏఈకి వెళ్తున్నారు.
ప్రధాని మోడీ (PM Modi) ఈనెల 13, 14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యూఏఈలో తొలి హిందూ దేవాలయాన్ని (First Hindu Temple) ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.