స్వాతంత్ర్య దినోత్సవం రోజున మణిపూర్ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో కొన్ని అపార్థాలు, స్వార్థ ప్రయోజనాలు, విదేశీ కుట్రల కారణంగా మరణకాండ జరిగిందని, ప్రజలు చనిపోయినట్లు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ పేర్కొన్నారు.
హర్యానాలో హింసాకాండ ఆగడం లేదు. రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి చిలికి పెద్ద దుమారం రేగింది. అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లాలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ హింసలో ఇప్పటివరకు ఐదుగురు మరణించగా.. 30 మందికి గాయాలయ్యాయి.
హర్యానాలోని నుహ్‌లో ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 1 గంటలకు విశ్వహిందూ పరిషత్ కాషాయ యాత్ర చేపట్టింది. ఈ యాత్రలో కాల్పులు, రాళ్ల దాడి జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం ప్రారంభమైన దహనకాండ ఇప్పటికీ ఆగడం లేదు. రోడ్డుపై కాలిపోతున్న వాహనాలు, పొగలు ఇంకా దర్శనమిస్తున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు హోంగార్డులు మరణించగా, మరో ఇద్దరు పోలీసు అధికారులకు తీవ్రంగా గాయాలయ్యాయి.