Fire Accident: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో ఫుడ్ ఫ్యాక్టరీలో మంటలు అదుపులోకి ఇంకా రాలేదు. మంటల దాటికి ఇప్పటికే ఒక ఫ్లోర్ కుప్పకూలి పోయంది. ఏ క్షణమైన బిల్డింగ్ పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు.
నేటి ఉదయం హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో ఓ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న కాటేదాన్ ప్రాంతంలో బిస్కెట్ తయారీ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కాటేదాన్ లో ఉన్న రవి బిస్కెట్ తయారీ పరిశ్రమలో నేటి ఉదయం ఒక్కసారిగా మంటలు చలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టంగా పోగలు కమ్ముకున్నాయి. ఆ సమయంలో మంటలు క్రమంగా ఫ్యాక్టరీలోని మూడు అంతస్తులకు వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. Also read: Gold Price…