ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదానికి ఆకతాయి మందుబాబులు లేదా గంజాయి బ్యాచ్ కారణమై ఉండవచ్చని ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు. హోల్ సేల్ మార్కెట్ కోసం 15సంవత్సరాల క్రితం 300భవనాలను నిర్మించింది ప్రభుత్వం. గొల్లపూడి కేంద్రంగా హోల్ సేల్ వర్తకులు తమ వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో జనసంచారం లేక నిర్మానుష్యంగా మారింది ట్రక్ టెర్మినల్.
Read Also:Kranthi Movie Review: క్రాంతి (ఓటీటీ)
దీంతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోయింది ట్రక్ టెర్మినల్. నిర్మానుష్యంగా ఉన్న ట్రక్ టెర్మినల్ భవనాల మద్య చేరుతున్న మందుబాబులు,గంజాయి బ్యాచ్ అరాచకాలకు కారణం అవుతున్నారు. అటువైపు వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ అగ్నిప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోంది. అసలక్కడ ఏం జరిగిందనేది తేలాల్చి ఉంది.
Read Also: India at UN: పాకిస్తాన్ తన ప్రజల గురించి ఆలోచిస్తే మంచిది.. భారత్ స్ట్రాంగ్ రిఫ్లై