Dubai Lottery ticket: డామిట్ కథ అడ్డంతిరిగింది.. లక్ వచ్చి తలుపు కొట్టినా తీయడేంటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dubai Lottery ticket: లక్ష్మీ దేవి ఎవరి తలుపు ఎప్పుడు కొడుతుందో ఎవరికీ తెలియదు. అయితే కొట్టినప్పుడు వెంటనే తలుపు తెరవాలి లేకపోతే కష్టం. అలాగే జరిగింది ఓ వ్యక్తికి. దుబాయ్ లో లాటరీ టిక్కెట్లు ఎక్కువగా కొంటూ ఉంటారు మన భారతీయులు. ఎక్కువగా మనవారికే లాటరీలు తగులుతూ ఉంటాయి కూడా. ఇలా సరదాగా కొన్న ఓ లాటరీ టికెడ్ మన భారతీయుడు ఒకరిని కోటీశ్వరుడిని చేసింది. సయ్యద్ అలీ అనే వ్యక్తి సరదాగా ఓ లాటరీ టికెట్ కొన్నాడు. అయితే దీనిని అతడు ఆన్ లైన్ లో కొనుగోలు చేశాడు. అయితే బుధవారం తీసిన డ్రాలో ఆన్లైన్లో కొన్న టికెట్ కు లక్కీ డ్రా తగిలింది.
Also Read: Crime News: మద్యం తాగి వచ్చాడని మందలించినందుకు.. తల్లిని చంపి నాలుక కోసిన కిరాతకుడు
Also Read
లాటరీ లక్కీ డ్రాలో భారతీయుడుకి రూ. 8.22 కోట్లు దక్కాయి. అంటే అతడు దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్ లాటరీలో జాక్ పాట్ కొట్టాడు. దీంతో అతడు రాత్రికి రాత్రే కోటిశ్వరుడు అయ్యాడు. అయితే ఇక్కడే ఒక కొసమెరుపు ఉంది. అతడు ఆన్ లైన్ లో ఇచ్చిన నంబర్ కు ఫోన్ చేస్తుంటే అది కలవడం లేదు. ఎన్ని సార్లు కాల్ చేసినా ఫలితం లేకుండా పోయింది. అతని ఇతను ఆగస్టు 30వ తేదీన 4392 నెంబర్ గల లాటరీ టికెట్ ను ఆన్ లైన్ లో కొన్నాడని నిర్వాహకులు తెలిపారు. అయితే అతడిని కాంటాక్ట్ కావడానికి వేరే మార్గాల్లో ప్రయత్నిస్తున్నామని కంపెనీ వారు తెలిపారు. ఈ విషయం తెలిసిన వారు లక్ తలుపు తట్టినప్పుడే తెరవాలి. అతడు ఇప్పుడు కంపెనీ వాళ్లకు దొరుకుతాడో లేదో అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా మరో భారతీయుడికి లాటరీ రావడం ఆనందించాల్సిన విషయం. దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ లాటరీ టికెట్స్ 1999లో ప్రారంభమైంది. ఈ టికెట్లు కొన్న వారిలో చాలా మంది భారతీయులే ఉన్నారు. అందులో ఇప్పటి వరకు మిలియన్ డాలర్ ను గెలుచుకున్న వారు 25 మంది. ఇప్పటివరకు ఒక మిలియన్ డాలర్ గెలుచుకున్న భారతీయుల్లో సయ్యద్ అలీ 25వ వ్యక్తిగా నిలిచాడని నిర్వాహకులు తెలిపారు.
తాజావార్తలు
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!