Fastest Centuries In T20: ప్రస్తుత క్రికెట్ లో బ్యాటర్స్ ఆధిపత్యం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఫార్మెట్ ఏదైనా సరే బాల్ ను బౌండరీకి తరలించే పనిలో ఉన్నారు బ్యాటర్లు. ఈ నేపథ్యంలో స్కోర్ బోర్డ్స్ లో భారీ నంబర్స్ కనపడుతున్నాయి. ఇకపోతే, ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టోర్నీలో గుజరాత్ ఓపెనర్ ఉర్విల్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడుపోని ఈ క్రికెటర్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో వరుసగా రెండోసారి 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో వరుసగా రెండోసారి 40 బంతుల్లోనే సెంచరీ చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా ఉర్విల్ పటేల్ నిలిచాడు. టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన టాప్ బ్యాట్స్‌మెన్స్ ఎవరో తెలుసా? వారెవరు? వారి వివరాలేంటో ఒకసారి చూద్దామా..
Also Read: Donald trump: కెనడా అమెరికాలో “51వ రాష్ట్రం” కావాలి.. ట్రూడోతో డొనాల్డ్ ట్రంప్..
సాహిల్ చౌహాన్:
ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ సైప్రస్‌పై 27 బంతుల్లో సెంచరీ చేసి ఫాస్టెస్ట్ టి20 సెంచరీ రికార్డును కలిగి ఉన్నాడు.
ఉర్విల్ పటేల్:
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్‌కు చెందిన 26 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ త్రిపురపై 28 బంతుల్లో సెంచరీ కొట్టి చరిత్రలో తన పేరు రాసుకున్నాడు.
Also Read:IND vs AUS: విరాట్ కోహ్లీకి గాయం..! అభిమానుల్లో టెన్షన్
క్రిస్ గేల్:
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 2013లో 66 బంతుల్లో 175 పరుగులు చేశాడు. ఇది ఇప్పటికీ టి20 క్రికెట్‌లో వ్యక్తిగత బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు. ఆ మ్యాచ్ లో అతను 30 బంతుల్లో తన సెంచరీని చేరుకున్నాడు.
రిషబ్ పంత్:
భారత వికెట్ కీపర్ 2018 ఐపీఎల్ లో ఢిల్లీ తరపున ఆడుతున్నప్పుడు బెంగళూరులో పూణే వారియర్స్‌పై 32 బంతుల్లో సెంచరీ చేశాడు.
విహాన్ లుబ్బే:
దక్షిణాఫ్రికా ఆటగాడు లింపోపోపై నార్త్ వెస్ట్ తరఫున 33 బంతుల్లో సెంచరీ చేశాడు.