Delhi Chalo: అరగంటలో బారికేడ్లను బద్దలుకొడతాం అంటూ.. ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను ప్రారంభించిన రైతులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers begins Delhi Chalo March: పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడం, 2020-21 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో పార్లమెంట్ వరకు ర్యాలీ (ఢిల్లీ చలో) చేపట్టేందుకు పలు రైతు సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సోమవారం రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన కీలక సమావేశం ఎలాంటి తీర్మానం లేకుండా ముగియడంతో.. ఢిల్లీ చలో మార్చ్‌ను రైతులు మంగళవారం ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీకి పయనం అయ్యారు. పలు రాష్ట్రాల రైతు సంఘాలు కూడా ఢిల్లీకి బయల్దేరాయి.
రైతుల ఆందోళనను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. రహదారులపై బహుళ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైతులను రాజధాని లోపలికి రాకుండా.. పలు చోట్ల కాంక్రీట్ బ్లాక్స్, ఇనుప కంచెలు, మేకులను అడ్డుగా పెట్టారు. సింగు, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఉంది. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ బారికేడింగ్‌లు ఏర్పాటు చేసినా తాము ఆందోళన చెందమని, అరగంటలో బారికేడ్లను బద్దలుకొడతాం అని రైతులు అంటున్నారు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
Also Read: Ishan Kishan: ఇషాన్ కిషన్‌పై బీసీసీఐ సీరియస్.. వేటు తప్పదా?
మరోవైపు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ శర్వణ్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ… ‘మేం బారికేడ్లను బద్దలు కొట్టాలనుకోవడం లేదు. చర్చలతోనే మా సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నాం. కానీ కేంద్రం మాకు ఏ విధంగా సాయం చేయడం లేదు. మా డిమాండ్లపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని మేము భావించడం లేదు. ప్రభుత్వం మాకు ఏదైనా ఆఫర్ చేసి ఉంటే.. అప్పుడు మేము పునరాలోచించవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఢిల్లీ చలో మార్చ్ మొదలుపెట్టాం. రోడ్లను బ్లాక్ చేస్తామని మేం ఎక్కడా చెప్పలేదు. ప్రభుత్వమే అలా చేస్తోంది. పంజాబ్, హరియాణా సరిహద్దులు అంతర్జాతీయ సరిహద్దుల్లా కన్పిస్తున్నాయి’ అని అన్నారు.
#WATCH | Farmers begin their ‘Delhi Chalo’ march from Shambhu Border. pic.twitter.com/tKEF6iEHkZ
— ANI (@ANI) February 13, 2024
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్‌రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!