Lenin Box Office Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lenin Box Office Collections: అఖిల్ అక్కినేని కెరీర్లోనే ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద బలమైన ఆరంభాన్ని నమోదు చేసింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ రివెంజ్ యాక్షన్ డ్రామా, విడుదలైన తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తూ వసూళ్లలో దూసుకుపోతోంది. మొదటి రోజు వచ్చిన పాజిటివ్ టాక్ తో రెండో రోజు కూడా కలెక్షన్లు మోత మోగుతోంది. ఈ ఊపుతో తొలి వారాంతంలోనే సినిమా భారీ మైలురాయిని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు. విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 37.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇందులో రెండో రోజు ఒక్కరోజే రూ.20.5 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం. తొలి రోజు నమోదైన రూ.16.7 కోట్ల కలెక్షన్లతో పోలిస్తే రెండో రోజు గణనీయమైన వృద్ధి కనిపించడం ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంటోంది.
ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ నుంచి కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోందని తెలుస్తోంది. వీకెండ్ కావడంతో ఆదివారం థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన కేంద్రాల్లో అడ్వాన్స్ బుకింగ్‌లు జోరుగా కొనసాగుతున్నాయని సమాచారం. దీంతో 50 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి ‘లెనిన్’ చేరేందుకు ఎంతో సమయం పట్టదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ప్రముఖ నటుడు నాగార్జునతో పాటు నిర్మాత నాగ వంశీ నిర్మాతలుగా వ్యవహరించారు. సినిమాలో ప్రమోద్ పంజు, శివాజీ, బ్రహ్మాజీ, సునీల్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. వీరి నటనకు కూడా మంచి స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు మరో ప్లస్ పాయింట్ థమన్ అందించిన సంగీతం. యాక్షన్ సన్నివేశాల్లో థమన్ బీజీఎం సినిమాకు మరింత హైప్ చేకూర్చిందని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ‘లెనిన్’కు లభించిన ఈ భారీ ఓపెనింగ్స్ అఖిల్ కెరీర్ ను మలుపు తిప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తొలి వారాంతం ముగిసే సమయానికి ఈ చిత్రం ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో అని సినీ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!