Muzammil Ibrahim: ప్రేమను మొదలుపెట్టింది ఆమెనే, కానీ బ్రేకప్ చేసింది నేనే!.. దీపికా మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muzammil Ibrahim: బాలీవుడ్ స్టార్ దీపికా పడుకోన్ పర్సనల్ లైఫ్ గురించి గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఆమె మోడలింగ్ రోజుల్లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు బయటికి వచ్చి వైరల్ అవుతోంది. మోడల్, నటుడు ముజమ్మిల్ ఇబ్రహీం తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీపికా పడుకోన్‌తో తనకు గతంలో ఉన్న సంబంధం గురించి మాట్లాడటమే అందుకు కారణం. అసలు వారి ప్రేమ ఎలా ప్రారంభమైంది, ఎందుకు ముగిసింది అనే విషయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముజమ్మిల్ ఇబ్రహీం మాట్లాడుతూ, తమ మధ్య ప్రేమాయణాన్ని ప్రారంభించింది దీపికా పడుకోనేనని పేర్కొన్నారు. మొదట తననే డేట్‌కు ఆహ్వానించిందని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో ఇద్దరూ మోడలింగ్ రంగంలో తమ కెరీర్‌ను నిర్మించుకునే ప్రయత్నంలో ఉన్నామని, తర్వాత కొంతకాలం ఇద్దరూ రిలేషన్లో కొనసాగినట్లు తెలిపారు. అయితే ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదని చెప్పారు.
ఇక్కడ మరొక ఆసక్తికర విషయం వారి బ్రేకప్ గురించి ముజమ్మిల్ చేసిన వ్యాఖ్యలే. ఇది ఇద్దరి పరస్పర అంగీకారంతో విడిపోలేదని, తానే ఆ సంబంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. నేనే ఆమెను వదిలేశాను, ఆ నిర్ణయంపై నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపికా పడుకోన్ బాలీవుడ్లో అగ్ర కథానాయికగా ఎదగకముందు తాము కలిసి ఉన్న రోజులను కూడా ముజమ్మిల్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తనకే ఎక్కువ గుర్తింపు, ప్రజాదరణ ఉండేదని చెప్పారు. అయితే కాలం మారిన కొద్దీ పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయని ఆయన అంగీకరించారు. ప్రస్తుతం దీపికా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సూపర్‌స్టార్‌గా నిలిచిందని, తనను మాత్రం చాలా మంది గుర్తించడం కూడా లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
అయితే గత సంబంధాన్ని గుర్తు చేస్తూనే దీపికా గురించి ముజమ్మిల్ ఎక్కడా ప్రతికూలంగా మాట్లాడలేదు. ఆమెపై తనకు ఇప్పటికీ గౌరవం ఉందని, ఆమె సాధించిన విజయాలు ప్రశంసనీయం అని అన్నారు. ఆమె ఎంతో అందమైన మహిళ అని పేర్కొంటూ, తనకు ఇప్పటికీ ఆమెపై అభిమానం ఉందని వెల్లడించారు. వ్యక్తిగత జీవితంలో ఇద్దరూ వేర్వేరు దారులు ఎంచుకున్నప్పటికీ, నటిగా ఆమె సాధించిన స్థాయిని తాను మెచ్చుకుంటానని చెప్పారు. ప్రస్తుతం ముజమ్మిల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ మంచి ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. త్వరలోనే ఆమె రెండో బిడ్డకు జన్మ ఇవ్వబోతోంది. మరి ఇలాంటి టైమ్ లో ముజమ్మిల్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది.
- Tags
- cinema
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..