MS Dhoni: ఆ విషయంలో ఇబ్బంది పడిన ధోనీ, సాయం చేసిన అభిమాని… వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేంద్ర సింగ్ ధోని… క్రికెట్ చరిత్రలో సుస్థిరంగా నిలిచే పేర్లలో ఇది కచ్ఛితంగా ఒకటి. ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మాహీ… తన సింప్లిసిటీతో కూడా ఎంతో మందికి దగ్గరయ్యాడు. పెద్ద సెలబ్రెటీ అయి ఉండి కూడా ధోని సింపుల్ గా ఉంటాడు. అందరితో కలిసిపోతూ ఉంటాడు. తన అభిమానులకు ఎంతో గౌరవమిస్తాడు. గర్వం మచ్చుకైనా కనిపించని ధోని అభిమానులతో ఇట్టే కలిసిపోతూ ఉంటాడు. అయితే, ధోనీ సింప్లిసిటీని తెలిపే మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
‘చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి… ఇలాంటి ప్రవర్తనే ఆయనను మిగిలిన సెలబ్రెటీల కంటే భిన్నంగా నిలపిందీ’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ జోడించారు. ఈ వీడియోలో ధోని తన స్నేహితుడితో కలిసి కారులో ఎక్కడికో వెళుతున్నట్లు కనిపిస్తోంది. ధోని స్నేహితుడు కారు నడుపుతున్నాడు. అయితే, మార్గమధ్యంలో వారికి దారి తెలీకపోవడంతో అదేదారిలో వెళుతున్న ఓ బైకర్ ను ఆపిన ధోని దారి ఎటని అడిగాడు.
Also Read
Also Read : Sushil Kumar : ఒకప్పుడు రూ.5 కోట్ల విన్నర్…. ప్రస్తుతం పాలమ్ముకుంటున్నాడు, అసలేమైంది?
‘అలా ముందుకు వెళితే నాలుగు రోడ్ల సర్కిల్ ఒకటి వస్తుంది. దాన్ని దాటి ముందుకెళితే రాంచీ వస్తుంది’ అని ఆ అభిమాని ధోనికి చెప్పాడు. ‘అది విగ్రహం ఉన్న సర్కిలేనా?’ అని ధోనీ మళ్లీ ఆ వ్యక్తిని అడగ్గా అతడు అవునని సమాధానం చెబుతాడు. ఆ తరువాత తన ఫ్యాన్‌తో సెల్ఫీ దిగి వెళ్లిపోయాడు ధోని. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారడంతో ధోని సింప్లిసిటీపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
This man is so simple and this simplicity is what makes him different from every other celebrity #MSDhoni #Dhoni pic.twitter.com/ErMlX3KGVX
— TAAGASTYA (@LalPatrakar) August 11, 2023
- Tags
- fans
- ms dhoni
- route
- viral video
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!