రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లైగర్ ప్లాప్ తో డీలా పడ్డ విజయ్ కు ఖుషి కాస్త ఊరటను ఇచ్చింది.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ . గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ నిర్మిస్తున్నారు… అయితే ఎస్‌వీసీ బ్యానర్‌లో 54వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుంది.. ఈ సినిమా ఏప్రిల్ 05న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ షూరు చేసింది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ అప్‌డేట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. త్వరలోనే టీజర్ రానుంది అంటూ ఎక్స్‌లో రాసుకోచ్చాడు. ఇక ఈ సినిమాలో కుటుంబ బాగోగులు చూసుకునే ఫ్యామిలీ మ్యాన్‌గా, బయట రౌడీల బెండు తీసే పవర్‌ఫుల్ మ్యాన్‌గా విజయ్ దేవకొండ ఇందులో కనిపించనున్నారు. కూల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించనున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు..అలాగే విజయ్ దేవరకొండ మరోవైపు జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో VD12లో కూడా నటించనున్నాడు. పోలీస్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా..యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Teaser వస్తుంది / வந்திட்டுருக்கு 🙂
— Vijay Deverakonda (@TheDeverakonda) March 1, 2024