ఫాల్కన్ గ్రూప్ సీఓఓ(చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) ఆర్యన్ సింగ్ అరెస్ట్ అయ్యాడు.. ఆర్యన్ సింగ్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాల్కన్ పెంపెనీ 7056 డిపాజిట్‌దారుల నుంచి రూ. 4215 కోట్లు వసూలు చేసింది. డిపాజిట్‌దారులకు రూ. 792 కోట్ల మోసానికి పాల్పడింది. చిన్న మొత్తంలో పెట్టుబడులకు భారీ లాభం అంటూ మోసం చేసింది.
READ MORE: Sonakshi Sinha : అతని వల్లే నేను ప్రెగ్నెంట్ అంటూ రూమర్లు.. స్టార్ హీరోయిన్ రిప్లై
కాగా.. అమర్దీప్ కుమార్, ఆర్యన్‌సింగ్, యోగేందర్ సింగ్, పవన్ కుమార్ ఓదెల, కావ్యనల్లూరి తదితరులంతా కలిసి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. పవన్ కుమార్ వైస్ ప్రెసిడెంట్, కావ్య నల్లూరి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ సంస్థకు అనుబంధంగా ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ సంస్థ ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహా మరికొన్నింటిని ఏర్పాటు చేశారు. కంపెనీల నిధుల సమీకరణలో భాగంగా ఉపయోగించే ఇన్వాయిస్ డిస్కౌంటింగ్‌ను తెరపైకి తెచ్చి జనాన్ని వంచించారు.
READ MORE: Uddhav Sena: మేము హిందీకి వ్యతిరేకం కాదు.. స్టాలిన్ వైఖరికి దూరంగా ఉద్ధవ్ ఠాక్రే పార్టీ..
నిందితులు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట హైటెక్‌సిటీలోని హుడా ఎన్‌క్లేవ్‌లోని భవనంలో కార్యాలయం ప్రారంభించారు. బ్రిటానియా, అమెజాన్, గోద్రేజ్ వంటి సంస్థలతో సంబంధాలున్నాయంటూ నమ్మబలికారు. 2021 నుంచి డిపాజిట్లు సేకరించారు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో యాప్, వెబ్సైట్ ప్రారంభించారు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు చెల్లిస్తామని 25 వేల నుంచి 9 లక్షల వరకు ఇన్వాయిస్లు అందుబాటులో ఉంచారు. నిందితులు 7056 డిపాజిట్‌దారుల నుంచి రూ. 4215 కోట్లు వసూలు చేసింది. ప్రారంభంలో వడ్డీతో సహా సక్రమంగా చెల్లింపులు జరిపినా, కొన్ని నెలలుగా ఆపేశారు. ఇలా 792 కోట్ల సొమ్మును పక్కదారి పట్టించి 14 కంపెనీల్లోకి మళ్లించారు.