Tamannaah Bhatia: అవును, ఆ సంబంధం ఉంది.. రూమర్స్‌పై తమన్నా క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamannaah Breaks Her Silence On Dating Vijay Verma: మిల్కీబ్యూటీ తమన్నా భాటియా, నటుడు విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారని.. కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. న్యూ ఇయర్ వేడుకల రోజు వీళ్లిద్దరు గోవాలో ముద్దు పెట్టుకున్న వీడియో వైరల్ అయ్యాక, డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. ఈ మధ్య వీళ్లు రెగ్యులర్‌గా చెట్టాపట్టాలేసుకుంటూ కెమెరాలకు చిక్కడంతో, వీళ్లు లవ్‌లో ఉన్నారన్న వాదనలు మరింత బలపడ్డాయి. ఇక వీళ్లిద్దరు అఫీషియల్‌గా తమ ప్రేమను ప్రకటించడమే తరువాయి అని అనుకుంటున్న తరుణంలో.. ఎట్టకేలకు తమన్నా ఓపెన్ అయ్యింది. తామిద్దరం ప్రేమలో ఉన్నామన్న మాట వాస్తవమేనని స్పష్టం చేసింది.
Honey Rose: పూల మధ్య మెరిసిపోతున్న హనీ రోజ్..
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. ‘‘సహనటుడు అయినంత మాత్రాన ఆ వ్యక్తి పట్ల ఆకర్షితులవుతారని నేను అనుకోవడం లేదు. నేను ఎంతోమంది నటులతో కలిసి నటించాను. నేను ఎవరితోనైనా ప్రేమలో పడాల్సి వస్తే.. అది మరింత వ్యక్తిగతమై ఉండాలి. అతనితో ఉన్నప్పుడు ఓ ప్రత్యేకమైన భావన కలగాలి. విజయ్‌తో ఉంటే, నాకు అదే అనిపిస్తుంది. అతను ఓ ప్రత్యేకమైన వ్యక్తి. నాకు రక్షణగా నిలబడుతాడనే నమ్మకం ఉంది. మా ఇద్దరి మధ్య చాలా ఆర్గానిక్ బంధం ఉంది. సినీ పరిశ్రమలో మంచి స్థాయిలో ఉన్నప్పుడు, కిందకు లాగడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి నుంచి విజయ్ నన్ను రక్షిస్తాడు. నేను నాకోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. ఆ వరల్డ్‌లోకి అనుకోకుండా నన్ను నన్నుగా అర్థం చేసుకునే వ్యక్తి వచ్చాడు. అతను నా పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. తను ఉన్న ప్రదేశమే నాకు సంతోషకరమైన ప్రదేశం’’ అంటూ చెప్పుకొచ్చింది.
Project k: ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమా విడుదల వాయిదా పడబోతుందా..?
గతంలో ఓసారి ఈ డేటింగ్ రూమర్స్ గురించి అడిగినప్పుడు.. తమ మధ్య ఎలాంటి బంధం లేదన్నట్టుగా తమన్నా రియాక్ట్ అయ్యింది. తామిద్దరం కలిసి ఒక సినిమా చేశామని, అలాంటప్పుడు ఆ రూమర్స్ రావడం సహజమేనని చెప్పింది. అలాంటి రూమర్స్‌ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టింది. కానీ.. ఇప్పుడు మాత్రం విజయ్‌తో తాను ప్రేమలో ఉన్నానంటూ వయ్యారాలుపోతూ చెప్పింది. ఇలా తమన్నా తన ప్రేమ వార్తల్ని కన్ఫమ్ చేయడంతో.. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!