బాలివుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. చేసింది తక్కువ సినిమాలే అయిన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. ఎప్పుడూ హాట్ లుక్ లో కనిపించే ఈ అమ్మడు ఇప్పుడు ఫ్యాన్స్ కు షాక్ ఇస్తూ చీరకట్టులో కనిపించింది.. వినాయక చవితి సందర్బంగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించించింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి..
దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు జరుగుతున్నాయి.. ఈ మేరకు ఇక సెలెబ్రిటీలు పండగను ఘనంగా జరుపుకున్నారు. తమ వేడుకల ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ సైతం పండగను జరుపుకుంది. ఆమె ఫెస్టివ్ లుక్ వైరల్ అవుతుంది.. ఇకపోతే జాన్వీ కపూర్ కి హిట్ పడింది. జులై 21న హాట్ స్టార్ లో విడుదలైన బవాల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బవాల్ విజయాన్ని జాన్వీ ఆస్వాదిస్తున్నారు. ఈ మూవీ థియేటర్స్ లో విడుదలై ఉంటే జాన్వీ కెరీర్ కి ప్లస్ అయ్యేది. జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ లు జంటగా నటించారు..
ఇదిలా ఉండగా.. జాన్వీ దేవర మూవీతో సౌత్ ఇండియా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఆమెకు గుర్తింపు ఉంది. గతంలో పలువురు మేకర్స్ ఆమెను సౌత్ చిత్రాల్లో నటింపజేసే ప్రయత్నం చేశారు. దర్శకుడు కొరటాల శివ ఇది సాకారం చేసి చూపారు. ఈ సినిమాతో టాలివుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది..యాక్షన్ ఎంటర్టైనర్ దేవర వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే నిరవధికంగా చిత్రీకరణ పూర్తి చేయనున్నారని సమాచారం..