NTV Telugu Site icon

BJP Telangana : ఈటల ఫోటో లేకుండా ఖమ్మంలో నిరుద్యోగ సభ.. ర్యాలీ

Etela

Etela

ఖమ్మం జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ ర్యాలీ సాగింది. బీజేపీ రాష్ర్ట అద్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ లో బ్యానర్లు, పోస్టర్లు ఫ్లెక్సీలలో ఈటల ఫోటో లేకపోవడం కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పార్టీకి చెందిన పలువురు ఫోటోలను ప్లెక్సీలు, బోర్డులలో పెట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, డీకే అరుణలతో పాటుగా పలువురు ఫోటోలను ఏర్పాటు చేశారు. అయితే రాష్ర్టంలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల ఫోటోలను మాత్రం పెట్టలేదు. దీనిపై సర్వత్రా చర్చ సాగుతుంది.

Also Read : Rajinikanth: ఇది తమిళ శక్తి.. “సెంగోల్”పై కీలక వ్యాఖ్యలు.. ప్రధానికి ధన్యవాదాలు..

పార్టీలో చేరికల కమిటి చైర్మన్ గా ఈటల రాజేందర్ ఉన్న విషయం తెలిసిందే. అయితే అతి ముఖ్యమైన పోస్టు అయినప్పటికీ అది ప్రోటో కాల్ పోస్టు కాదని అందువల్ల పెట్టలేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సభలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీని మార్చకుండా మళ్లీ పరీక్షలు జరిగితే సహించేది లేదని, బండి నరేంద్రమోదీ శిష్యుడు, అమిత్ షా అనుచరుడు అంటూ కామెంట్ చేవాడు. ప్రజల కోసం నెలకు ఒకసారి జైల్ కు వెళ్లేందుకు సిద్దం అని, ఖమ్మంలో కాషాయ జెండా ఎగరేస్తామని అన్నారు. ప్రభుత్వం సర్పంచుల ఉసురు పోసుకుంటోందని, 5 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి, ఈ ప్రభుత్వాన్ని పాతిపెట్టాలని ప్రజలను బండి సంజయ్‌ కోరారు.

Kanhaiya Kumar : బీజేపీ ది జూట్.. లూట్ ప్రభుత్వం