మోడీ 9 ఏళ్ల ప్రభుత్వం కి 9 సవాళ్లు.. బీజేపీ ది జూట్ ..లూట్ ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి కన్నయ్య కుమార్. ఇవాళ ఆయన గాంధీ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అనడం కంటే… ఇది మోడీ ప్రభుత్వం అనడం బెటర్ అని ఆయన వ్యాఖ్యానించారు. నల్లధనం వెనక్కి తెస్తా అన్నారు..ఏమైందని ఆయన ప్రశ్నించారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అన్నారు… ఏమైంది, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘9 ఏళ్ళల్లో మోడీ ఏం చేశారు అనేది మేమే కాదు.. ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పాలి. సీబీఐ.. ఈడీలు… అక్రమార్కులు ఇంటికి పోవడం ఎప్పుడో మానేసింది. బీజేపీ ఏం చెప్తే అది చేస్తోంది. తప్పులు చేసిన వాళ్ళంతా బీజేపీ వాషింగ్ మెషిన్ లోకి వచ్చి పవిత్రంగా మారుతున్నారు. అదానీ అభివృద్దే దేశ అభివృద్ధి అనుకుంటున్నారు. రైతులు అభివృద్ధి అవుతుంటే. అమిత్ షా తన కొడుకుని రైతుగా ఎందుకు చేయలేదు. మేక్ ఇన్ ఇండియా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మోదీ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడుతోంది. మోదీ ప్రధాని అయ్యాక పేదవాళ్ళ సంఖ్య పెరిగింది.
Also Read : Botsa Satyanarayana : చంద్రబాబు పాలన అంతా కరువు, కాటకాలే
అదానీ షెల్ కంపెనీల్లో పెట్టుబడులు ఎవరివో ఎందుకు చెప్పడం లేదు. 9 సంవత్సరాల్లో మోదీ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ప్రధాని కేవలం ప్రధాని మాత్రమే కాదు. ఆయనే రాష్ట్రపతి, ఆర్థిక మంత్రి, హోం మంత్రి, విదేశాంగ మంత్రి. మోదీకి ఏం కావాలనిపిస్తే అది అయిపోతారు. ధరలు పెరుగుతున్నాయి అంటే ధరలు తగ్గించడం ప్రధాని పని కాదని బీజేపీ వాళ్లు అంటున్నారు. బీజేపీ వాళ్లు కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అంటారు కానీ మిత్ర రాజకీయాలకు వ్యతిరేకం అని చెప్పలేరు. పుల్వామా ఘటనకి ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించినా ప్రభుత్వం వినలేదని చెప్పారు. ఓబీసీ అని చెప్పుకునే ప్రధాని కులగణనని ఎందుకు ఒప్పుకోవడం లేదు? మై పార్లమెంట్ మై ప్రైడ్ అంటున్న మోదీ మన పార్లమెంట్ మన ప్రైడ్ అనలేక పోతున్నాడు. పీఎం కేర్ ఫండ్ పీఎం కోసమే ఏర్పాటు చేశారు. అందుకే వివరాలు బయటకి చెప్పడం లేదు. కరోనా వాక్సిన్ కోసం డబ్బులను పెట్రోల్ రేట్ల నుండి లాగుతున్నారు. మోదీ విశ్వగురువు అయ్యారనే నినాదంతో బీజేపీ ఈసారి ఎన్నికలకు వెళ్తుంది.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Bunny Vas: ఆ రోజు నేను అలా చేశాను కాబట్టే నాకు ఇలా జరుగుతుందేమో…